Nani New Movie : ప్రియదర్శితో నాని మూవీ సెట్… కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది

Nani New Movie : నేచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే, దసరా, హాయ్ నాన్న మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శితో కలిసి ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇందులో నాని హీరో కాదు. మరి ఇంతకీ ప్రియదర్శితో నాని చేయబోతున్న ప్రయోగం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

అసలైన ట్విస్ట్ ఇదే

మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరున్న నాని ప్రస్తుతం సాలిడ్ లైనప్ తో బిజిగా ఉన్నారు. మరోవైపు నిర్మాతగా మారి హిట్, హిట్: ది సెకండ్ కేస్ వంటి చిత్రాలను నిర్మించారు. తన హోమ్ బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాపై మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు పలువురు మేకర్స్ తో చర్చలు జరుపుతున్నారు నాని. తాజా వార్తల ప్రకారం నాని నిర్మాతగా రూపొందనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఒక నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌లో కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రియదర్శి సంతకం చేశారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

ప్రియదర్శి సినిమాల విషయానికొస్తే…

ప్రియదర్శిఒకవైపు కమెడియన్ గా అదరగొడుతూనే, కంటెంట్ ఉన్న సినిమాలతో హీరోగా కూడా రాణిస్తున్నారు. రీసెంట్ గా బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రియదర్శి హీరోగా నటించిన వెబ్-ప్రాజెక్ట్ “సేవ్ ది టైగర్స్”కు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ ను చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. రెండవ సీజన్ సేవ్ ది టైగర్స్-2 ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రియదర్శి రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు.

- Advertisement -

నాని సినిమాల విషయానికొస్తే…

రీసెంట్ గా “హాయ్ నాన్న” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” మూవీతో బిజీగా ఉన్నారు. తన కెరీర్లో 31వ చిత్రంగా రూపొందుతున్న “సరిపోదా శనివారం” మూవీని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్నాడు నాని. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో “అంటే సుందరానికి ” అనే ప్లాప్ మూవీ వచ్చింది. అయినప్పటికీ మరోసారి నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు చాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాని బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన స్పెషల్ టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం “సరిపోదా శనివారం” చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడ్డారు నాని. ఈ మూవీని ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆ తరువాత సుజీత్, బలగం వేణు, శీకాంత్ ఓదెల వంటి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలను లైన్ లో పెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు