Devara: ఎన్టీఆర్ దేవరలో ఆ యంగ్ హీరో.. ?

Devara:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ అంతా కాదు. అందరి హీరోల కంటే ఒక మెట్టు పైకే ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్… జక్కన్న పుణ్యమా అంటూ పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించిన కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ జీవించేశాడు. ఈ సినిమా బంపర్ బ్లాస్ట్ హిట్ కావడంతో రామ్ చరణ్ కు అలాగే జూనియర్ ఎన్టీఆర్కు మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు బడా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తుంటే… ఆయన సరసన అలనాటి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోంది. అచ్చం పల్లెటూరి పాత్రలో హీరోయిన్ జాన్వి కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు కూడా నటిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొరటాల దర్శకత్వంలో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో అందరు ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

ఆ హీరో ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ అని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే దిశగా పయనిస్తోంది. ఎవ్వడు ఈ సినిమాను ఆపడం లేదు. అయితే ఈ సినిమా నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ ను జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించారు. అంతేకాదు అతనితో ఫోటోలు కూడా దిగారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మరియు సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది దేవర సినిమాలో ఓ చిన్న పాత్ర సిద్దు జొన్నలగడ్డకు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి టిల్లు స్క్వేర్ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. కాగా డీజె టిల్లు సినిమాను గత రెండు సంవత్సరాల కింద రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నేహా , సిద్దు జొన్నలగడ్డ జంటగా నటించారు. అప్పుడు ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ తీశారు.

అయితే ఈ సీక్వెల్ లో నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక త్వరలోనే ఈ సినిమా మూడవ భాగం కూడా వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు