Nagashaurya: రహస్యంగా నాగశౌర్య పెళ్లి.. కారణం చెప్పిన తల్లి..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరో గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పలు చిత్రాల ద్వారా కెరియర్లో బిజీగా ఉన్న నాగశౌర్య ఇటీవల ఇంటీరియర్ డిజైనర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత శౌర్య మళ్లీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తల్లి ఉష హైదరాబాద్ మాదాపూర్ లో రెస్టారెంట్ నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెస్టారెంట్లో నాన్ వెజ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇటీవల తన రెస్టారెంట్ నుండి తయారుచేసిన బిర్యాని ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ కి ఆమె పంపించారు.

రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఉష మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఈ రెస్టారెంట్ కి మంచి ఆదరణ కూడా లభించింది. అంతేకాదు ఇక్కడ కుక్కర్ బిర్యాని కూడా అందిస్తున్నారు. కుక్కర్ బిర్యాని అంటే స్వయంగా మనం ఆర్డర్ ఇస్తే కుక్కర్ లోనే మనం ఆర్డర్ ఇచ్చినటువంటి బిర్యానీని మన ముందుకు తీసుకొస్తారు. ఇలా ఈ రెస్టారెంట్లో లభించే ఈ బిర్యాని చాలా టేస్ట్ గా ఉంటుంది అంటూ రుచి చూసిన కస్టమర్లు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉష మాట్లాడుతూ.. శౌర్య గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. శౌర్య పెళ్లి చాలా సైలెంట్ గా.. రహస్యంగా చేసేసారు.. కారణమేంటి? అని అడగ్గా.. ఆమె మాట్లాడుతూ.. శౌర్యకి ముందు నుంచే పబ్లిసిటీ ఇష్టం ఉండదు. అందుకే తన పెళ్లిని కూడా చాలా సింపుల్ గా చేసుకోవాలని అనుకున్నారు. ఈ కారణంగానే ఎవరికి ఇన్ఫాం చేయకుండా చాలా సింపుల్ గా నాగశౌర్య పెళ్లి జరిపించేసాము అంటూ ఆమె తెలియజేశారు. ఇక శౌర్య పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులకు తాను ఒకటే కావడంతో తన పెళ్లి అలా చేశామని.. లేకపోతే ఇంకా సింపుల్గా చేసే వాళ్ళమని శౌర్య తల్లి తెలిపారు. అంతేకాదు అమ్మాయి చాలా మంచిదని.. తన ప్లేస్ ను రీప్లేస్ చేసిందని కూడా తెలిపారు ఉష. ఇక శౌర్య భార్య ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తూనే.. మరొకవైపు భర్తకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుందని సమాచారం.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు