Thandel : ‘మంగళవారం’ బ్యూటీ కీ రోల్… కథ మలుపు తిరుగుతుందా?

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ లో మంగళవారం బ్యూటీ కీలక పాత్ర పోషించబోతోందా?

యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే కొత్త మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీ మత్స్యకారుల జీవితాల చుట్టూ తిరుగుతుంది అని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ అంతా శ్రీకాకుళం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లో జరగబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో మంగళవారం బ్యూటీ కీలకపాత్ర పోషించబోతోంది అనే వార్త బయటకు వచ్చింది. మంగళవారం బ్యూటీ అనగానే పాయల్ రాజ్ పుత్ అనుకుంటే మీ ఆశలు అడియాశలైనట్టే. మరి ఆ బ్యూటీ ఎవరు అంటే దివ్య పిళ్ళై.

నిజానికి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ రీసెంట్ గా వచ్చిన మంగళవారం సినిమాలో దివ్య కీలక పాత్రలో కనిపించింది. ఈ మూవీనే ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీలో దివ్య కీలక పాత్ర పోషించబోతోంది అని సమాచారం. అయితే ఆమె ఎలాంటి పాత్ర చేయబోతోంది అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ అమ్మడు పాత్ర కీలకంగా ఉంటుందని, సినిమాను మలుపు తిప్పుతుందని ప్రచారం జరుగుతుంది. మరి అందరూ అనుకుంటున్నట్టుగా దివ్య పాత్ర తండేల్ మూవీని కీలక మలుపు తిప్పుతుందా? అనే సందేహం ఉత్కంఠతను రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు చక్కర్లు కొడుతుండడంతో మూవీపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే మేకర్స్ మంగళవారం సినిమాతో ఈ బ్యూటీ కి వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారని అనిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమాకు హీరోయిన్ సాయి పల్లవి మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

రూమర్స్ ప్రకారం దివ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండి, ఆమె గనుక ప్రేక్షకుల మెప్పు పొందితే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఇదిలా ఉండగా తండేల్ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది. ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు