Animal: అందుకే త్రిప్తి పాత్రను రిజెక్ట్ చేశా – సారా అలీ ఖాన్..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా పేరు వినిపిస్తోంది. ఇందులో ఉండే యాక్షన్ సన్నివేశాలు బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా యువతను మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాను కొంతమంది విమర్శిస్తే మరి కొంతమంది సూపర్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు స్టార్ డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ కూడా.. ఇలాంటి సినిమా తీసినందుకు సందీప్ వంగాను ప్రశంసిస్తున్నారు. అలాగే యానిమల్ సినిమాలోని పాత్రకి ఒకరు విజయ్ దేవరకొండ.. మరొకరు రణబీర్ కపూర్ తప్ప ఈ పాత్రను వేరొకరు చేయలేరు అంటూ గట్టిగా చెబుతూ ఉండడం గమనార్హం.

ఈ సినిమాలో హీరోయిన్ గా రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించింది. అయితే ఆమె కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది నటి త్రిప్తి దిమ్రి.. ఈ సినిమా తర్వాత వరుసగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ తన మాటలతో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాలో ఆమె బోల్డ్ నెస్ కి చాలా మంది యువత కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఇలాంటి బోల్డ్ పాత్రలో ఈమె తప్ప ఇంకొకరు నటించలేరు అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నారట దర్శకనిర్మాతలు. ఆమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్.

ముందుగా ఈ పాత్ర బాలీవుడ్ యంగ్ బ్యూటీ అయిన సారా అలీ ఖాన్ కి రాగా.. ఇందులో ఉండే బోల్డ్ నెస్ అలాగే నెగెటివిటీ తనకు అసలు నచ్చలేదట. ఇందులో ఉండే కొన్ని సన్నివేశాలను సారా తీసివేయమని డిమాండ్ చేసిందట. ఇక ఆ సన్నివేశాలు తీసేస్తే సినిమాకి అంతగా స్కోప్ రాదు అన్న ఉద్దేశంతో సన్నివేశాలు మార్చడం కుదరదని.. ఆ పాత్రకి సారా అలీ ఖాన్ ను మార్చేసి త్రిప్తికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇక అలా సారా అలీ ఖాన్ చేయాల్సిన ఆ పాత్రలో త్రిప్తి చేసి తాను ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఏది ఏమైనా సారా కూడా ఈ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదేమో అంటూ సినిమా చూసిన తర్వాత కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు