UV Creations : సంతోష్ శోభన్ కు షాక్ ఇచ్చిన తమిళ విలన్

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కు తమిళ విలన్ నో చెప్పి షాక్ ఇచ్చాడు. సంతోష్ కొత్త సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశాడా?

యంగ్ అండ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏక్ మినీ కథ అంటూ లాక్ డౌన్ టైంలో ఓటిటిలో పాపులర్ అయిన మూవీతో సంతోష్ శోభన్ కు మంచి క్రేజ్ దక్కింది. ఈ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ కు విమర్శకుల నుంచి వందకు వంద మార్కులు పడ్డాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల అతి కొద్ది మంది హీరోల జాబితాలో సంతోష్ కూడా చేరిపోయాడు.

అనంతరం ఈ హీరోకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయని అంతా భావించారు. అనుకున్నట్టుగానే బాగానే ఆఫర్లు వచ్చాయి. అయితే అవన్నీ ఈ హీరోను నిరాశపరిచాయి. ఆయన రీసెంట్ సినిమాలు ప్రేమ్ కుమార్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్ని మంచి శకునాలే వంటి సినిమాలకు శకునాలు అంత బాగా ఏమి కుదరలేదు. దీంతో వరుస డిజాస్టర్ లో తన ఖాతాలో వేసుకున్నాడు సంతోష్.

- Advertisement -

ఇక ఎన్నో ఆఫర్లు వచ్చినా సరైన స్క్రిప్ ను ఎంచుకోలేకపోతున్న ఈ యంగ్ హీరోను చూసి జాలి పడుతున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల నాడీని పట్టుకోవడంలో ఈ హీరో విఫలం అవుతున్నాడు. ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఈ హీరో తాజా సినిమాలో నటించడానికి మరో పాపులర్ నటుడు నో చెప్పాడట. కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా లేని సంతోష్ శోభన్ తో రిస్క్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రెడీ అయింది.

25 కోట్ల భారీ బడ్జెట్ తో శ్రీరామ్ అనే కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సంతోష్ శోభన్ హీరోగా యువి క్రియేషన్స్ మూవీని ప్లాన్ చేసింది. ఇక ఈ హీరోతో రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిన ఈ బడా ప్రొడక్షన్ హౌస్ ఎలాగైనా సంతోష్ కి ఈసారి హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఈ సినిమాలో పలువురు క్రేజీ స్టార్స్ లో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుపుతోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న పాపులర్ నటుడు అర్జున్ దాస్ ను విలన్ గా తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆయన ఈ మూవీని రిజెక్ట్ చేసి మేకర్స్ కి షాక్ ఇచ్చాడట. కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీతో అర్జున్ దాస్ కి మంచి పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈయన రిజెక్ట్ చేయడంతో ఆ విలన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంతోష్ శోభన్ తో యువి క్రియేషన్స్ ఇంకా రెండు సినిమాలు కమిట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ రెండు ప్రాజెక్టులు పట్టాలు ఎక్కడానికి ఇంకా సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు