Naga Shourya: రంగబలి వీకెండ్ కలెక్షన్స్.. పరవాలేదే..

టాలీవుడ్ టాలెంటెడ్ ఆక్టర్ నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి జులై7 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో చాలా మంది ఆడియన్స్ ఇంట్రస్ట్ కూడా చూపించలేదు. కానీ ఎప్పుడైతే కమెడియన్ సత్య ఇంటర్వ్యూ వైరల్ అయిందో అప్పట్నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరుపుకున్న ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలైనా కూడా మొదటి షో ముందే నెగిటివ్ టాక్ ని మూట గట్టుకుంది.

కానీ అందర్నీ ఆశ్యర్య పరుస్తూ ఈ సినిమా మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్లను సాధించింది. రోజుకు కోటికి పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తూ మూడు రోజులకు గాను 4.85 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. షేర్ పరంగా 2.48 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మాత్రం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. 6.20 కోట్ల బిజినెస్ ఈ సినిమాకి బిజినెస్ జరగగా ఇప్పటివరకు వచ్చిన వసూళ్లతో లెక్కేస్తే, ఇంకా బ్రేక్ ఈవెన్ కావడానికి దాదాపు 3.72 కోట్లు కావాలి.

అయితే వీకెండ్ కాబట్టి, పైగా బోనాల పండుగ సెలవు అడ్వాంటేజ్ తో వీకెండ్ జోరు చూపించిన రంగబలి బ్రేక్ ఈవెన్ అవ్వడమంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే చాలా మేజర్ ఏరియాల్లో వర్షాల ప్రభావం వల్ల థియేటర్లకు జనాలు వెళ్లడం లేదు. పైగా ఈ సినిమా కి వచ్చిన నెగిటివ్ టాక్ దృష్ట్యా రంగబలిని ఆదరిస్తారనే నమ్మకం లేదు. అయినా చెప్పలేము, బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా, నష్టాలనైతే ఈ సినిమా తగ్గుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు