Jawan : అట్లీ సినిమాలలో రెగ్యులర్ గా కనిపించే ఆ అంశం జవాన్ లో లేదేంటి ?

తమిళ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. కాసేపటి క్రితమే అట్లీ – షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో రాబోతున్న జవాన్ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను తలపిస్తుంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నట్టే టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. కానీ టీజర్ లో అట్లీ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఒక అంశం తక్కువైందని అట్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచమైన అట్లీ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే వీటిలో మూడు సినిమాలు తలపతి విజయ్ తోనే ఆయన చేయడం విశేషం అని చెప్పాలి. సాధారణంగా అట్లీ సినిమాలలో హీరోలకు రెండు మూడు మేక్ ఓవర్ లు ఉండటం తప్పనిసరి అని అందరికి తెలిసిందే. అయితే ఈ మేక్ ఓవర్ లను అట్లీ ప్రేక్షకులను ఆయన కన్ఫ్యూజ్ చేయడానికి టీజర్ అండ్ టైలర్ లో పెట్టి హీరో డబుల్ యాక్షన్ చేస్తున్నాడా , లేక ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడా అనే ఫీల్ ను తెప్పించి సినిమాపై బజ్ క్రియేట్ చేస్తాడు.

కాగా జవాన్ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ కు మేక్ ఓవర్ లు చాలానే ఉన్న టీజర్ ద్వారా షారుఖ్ ఖాన్ సింగల్ హీరోనే అని ప్రేక్షకులను ఇట్టే తెలిసిపోయింది. అయితే ఎప్పటిలాగా ప్రేక్షకులను మేక్ ఓవర్ ల ద్వారా కన్ఫ్యూజ్ చేసే అట్లీ ఈసారి అలా చేయకుండా స్ట్రెయిట్ గా టీజర్ కట్ చేయడంతో ఆయన అభిమానులు ఏంటి ఈసారి అట్లీ ఎందుకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా కథ ఏంటో చెప్పేసాడంటూ ఆయనపై ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

షారుఖ్ ఖాన్ కు జోడిగా ఈ సినిమాలో నయనతార నటిస్తుండగా, విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు