Sreevishnu: సామజవరగమన ట్రిపుల్ బ్లాక్ బస్టర్..

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సామజవరగమన దూసుకుపోతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా మౌత్ టాక్ బలంతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భారీ వసూళ్లు రాబడుతూ నిర్మాత కు డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. జూన్ 29న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకోగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

శ్రీ విష్ణు ఈ సినిమాలో హీరోగా నటించగా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా అందర్నీ మెప్పిస్తుంది. ఇక కేవలం 3.50 కోట్ల బిజినెస్ చేసిన సామజవరగమన సినిమా 4 కోట్ల టార్గెట్ తో విడుదలయింది. ఈ బిజినెస్ టార్గెట్ ను వీకెండ్ లోనే అందుకోగా ఫస్ట్ వీక్ ముగిసే సరికి డబల్ ప్రాఫిట్ ని వెనకేసుకుంది. ఇక తాజాగా సామజవరగమన సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు కూడా బయటికి వచ్చాయి.

మొదటివారం ముగిసేసరికి దాదాపు7.80 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా 15కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. తాజాగా సామజవరగమన పండగ అడ్వాంటేజ్ తో మరో వీకెండ్ కుమ్మింది. 11రోజులు ముగిసే సరికి ఈ చిత్రం 11.60 కోట్ల షేర్ ని 22.85 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఈ వసూళ్లతో సామజవరగమన సినిమా మూడు రేట్లకు పైగా లాభాన్ని ఆర్జించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అది ఈ సినిమాకి అడ్వాంటేజ్ గా మారింది. మరి ఓవరాల్ గా కలెక్షన్స్ ఎండ్ అయ్యేసరికి ఎంత రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు