Samantha: మరోసారి విడాకులు తీసుకోబోతున్న నాగచైతన్య.. !

అక్కినేని సినీ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యువ సామ్రాట్ నాగచైతన్య ఇప్పుడు మరోసారి విడాకులు తీసుకోబోతున్నారు. సమంతతో.. నాగచైతన్య ప్రేమ, పెళ్లి, విడాకుల విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి విడాకులు ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈసారి రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అవును ఈసారి తన రాబోయే సినిమాలో విడాకులు తీసుకోబోతున్నారట నాగచైతన్య.

ఆయన సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ తర్వాత ఇప్పటివరకు చైతన్యకు సాలిడ్ హిట్ దక్కలేదు. ఇటీవల వచ్చిన కస్టడీ సినిమా కూడా ఘోరంగా పరాజయం పాలైంది. దాంతో నాగచైతన్య ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఓ మంచి హిట్ కోసం ఎలాంటి కాంట్రవర్షియల్ కంటెంట్ అయినా టచ్ చేయడానికి సిద్ధపడుతున్నాడట చైతు. అయితే ఇతర కాంట్రవర్షియల్ కంటెంట్ తీసుకోవడం కంటే ఆయన జీవితంలో బాధపడిన విడాకుల అంశాన్ని తెరపై చూపించాలని నిర్ణయించుకున్నారట. సమంతతో విడాకులకు గల కారణాలు ఏంటి..? ఇందులో తప్పు ఎవరిదో జనాలకు తెలియాలనే ఉద్దేశంతో తమ విడాకులకు సంబంధించిన కథని తెరపై చూపించబోతున్నారట నాగచైతన్య.

- Advertisement -

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కథ కనుక ఫైనల్ అయితే నాగచైతన్య విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమా ద్వారా అయినా మంచి హిట్ అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో అయినా నాగచైతన్య – సమంత ఎందుకు విడాకులు ప్రేక్షకులకు తెలుస్తుందేమో..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు