కొర‌టాల ఎంత ప‌ని చేశావ‌య్యా..??

టాలీవుడ్ కు వ‌రుస హిట్స్ ఇచ్చిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ తో మెగా మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఆచార్య చేస్తున్న విష‌యం తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మ‌రో రెండు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే యూఎస్ లో ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మెగా హీరోల‌ను ఒకే తెర‌పై చూడ‌టానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర 5 నుంచి 10 నిముషాలు అని అనుకున్నారు. ఆ గెస్ట్ రోల్ కాస్త మెయిన్ రోల్ గా మారింది. ఫ‌స్టాఫ్ లో చిరంజీవి ఉండ‌గా.. సెకండాఫ్ లో రామ్ చ‌ర‌ణ్ సిద్ధ పాత్ర నే 50 శాతం ఉంటుంద‌ట‌. మిగితా 50 శాతం ఆచార్య – సిద్ధ క‌నిపిస్తారాట‌. సిద్ధ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటాడ‌ని స‌మాచారం. ఫైట్ సిన్స్ లో చ‌ర‌ణ్ న‌ట‌న వేరే లెవెల్ లో ఉంటుంద‌ట‌.

అయితే ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర గురించి సోష‌ల్ మీడియాలో ఒక వార్త తెగ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ చ‌నిపోతాడట‌. ధ‌ర్మ‌స్థ‌లి ని కాపాడే క్ర‌మంలో సిద్ధ ప్రాణ త్యాగం చేయాల్సి ఉంటుంద‌ట‌. దీని త‌ర్వాత ఆచార్య‌.. ధ‌ర్మస్థ‌లిని కాపాడే బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ వార్త సోష‌ల్ మీడియాలో రావ‌డంతో మెగా ఫ్యాన్స్.. కొర‌టాల పై ఫైర్ అవుతున్నారు. త‌మ హీరోను ఎలా చంపుతార‌ని ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు.

- Advertisement -

అయితే రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీలో గెస్ట్ రోల్ గానే ఉంటుందట‌. సిద్ద పాత్ర‌తోనే ఆచార్య పాత్ర‌కు హైప్ వ‌స్తుంద‌ని స‌మాచారం. అందుకోసమే సిద్ధ‌ను చంపాల్సి వ‌చ్చింద‌ట‌. గ‌తంలో ఎవ‌డు మూవీలో అల్లు అర్జున్ తో పాటు ప‌లు సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ వ‌చ్చిన హీరోలు చ‌నిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు