మెగాస్టార్ మళ్ళి లీక్ చేసేశాడు.. ఈసారి పవణ్ కళ్యాన్ బలి !

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుసగా సినిమాల‌ను లైన్ లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే క్రిష్ జాగ‌ర్ల‌మూడీ డైరెక్ష‌న్ లో హ‌రి హ‌ర వీర మ‌ల్లు షూటింగ్ నె 60 శాతం పూర్తి చేసుకున్నాడు. దీనితో పాటు సురేంద‌ర్ రెడ్డి తో ఒక సినిమా, హ‌రీశ్ శంక‌ర్ తో భ‌వ‌దీయుడు భ‌గత్ సింగ్ సినిమాల‌ను ప్ర‌క‌టించాడు. ఇక కాగ స‌ముద్ర ఖ‌ని తో వినోద‌య సీతం రీమేక్ షూటింగ్ ప్రారంభించ‌డానికి రెడీ గా ఉన్నాడు. అంతే కాకుండా.. సుధీర్ వ‌ర్మ తో పోలిసోడు ను రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఇటు చేతినిండ సినిమాలు, అటు పాలిటిక్స్ తో ప‌వ‌న్ ఫుల్ బిజీ గా ఉన్నాడు.

కాగ ఈ బిజీలో ప‌వ‌న్.. హ‌రీశ్ శంక‌ర్ తో ప్ర‌క‌టించిన భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాను ప‌క్క‌న పెట్టార‌ని గ‌త కొద్ది రోజులగా వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌రి హ‌ర వీర మ‌ల్లు త‌ర్వాత పవ‌ర్ స్టార్.. వినోద‌య సీతం, పోలీసోడు రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడ‌ని ఇండ‌స్ట్రీలో వినిపించింది. అయితే తాజా గా ఈ వార్త‌ల‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ ఖండించింది. హ‌రీశ్ శంక‌ర్ – ప‌వ‌న్ సినిమా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా.. డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ తాజా గా ఆచార్య చిత్ర బృందాన్ని ఇంట‌ర్వ్యూ చేశాడు. దీనిలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాలో డైలాగ్ బాగుంద‌ని చిరంజీవి అన్నాడు. అది ఇప్పుడు చెప్పాల‌ని కోరాడు. దీంతో హ‌రీశ్.. ” మొన్న వీడు మ‌న ఇంటికొచ్చి, పెద్ద‌గా అరిచిప్పుడు, అస‌లు ఏంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థం అయింది.. వీడు న‌డిస్తే వీడి వెన‌కాల ల‌క్ష మంది న‌డుస్తున్నారు… బ‌హుశా ఇదే ఇత‌ని ధైర్యం ఏమో!! …. లేదు సార్ ఆ ల‌క్ష మందికి ఆయ‌న ముందు ఉండి న‌డుస్తున్నాద‌న్న‌దే ధైర్యం ” అంటూ డైలాగ్ చెబుతాడు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ డైలాగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ చూసిన మెగా ఫ్యాన్స్ ప‌వ‌న్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే భ‌గ‌త్ సింగ్ కాంబో మ‌రో సారి కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఏది ఏమైనా.. హ‌రీశ్ – ప‌వ‌న్ సినిమా ఇంకా ఉంద‌నే ఈ డైలాగ్ తో క‌న్ఫామ్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు