మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ మరింత డిలే కానుందా?

ఆర్.ఆర్.ఆర్ పూర్తయిన తర్వాత రాజమౌళి … మహేష్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. అడవుల నేపథ్యంలో రూపొందే ఓ అడ్వెంచరస్ మూవీ ఇదని తెలిపారు. అయితే దానితో పాటు మరో కథ కూడా మహేష్ కు వినిపించినట్లు రాజమౌళి తెలిపారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత ఆలస్యం కానుంది అనేది తాజా సమాచారం.

వాస్తవానికి అయితే.. 2022 చివర్లో మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. అప్పటికి మహేష్… త్రివిక్రమ్ సినిమాని కూడా ఫినిష్ చేసి రెడీగా ఉంటారు. నవంబర్ ఎండింగ్ కి ఆ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇంకో 3,4 నెలలు అదనపు సమయం కావాలని మహేష్ ను కోరాడట. స్క్రిప్ట్ పనులు పూర్తయినా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కి రాజమౌళి ఎక్కువ టైం తీసుకుంటారు.సాంకేతిక నిపుణులు చాలా వరకు రాజమౌళి సినిమాకి సేమ్ ఉంటారు. కానీ పాన్ ఇండియా మూవీ కాబట్టి.. అన్ని భాషల్లోనూ స్టార్ నటులను ఎంపిక చేసుకోవాలి. వాళ్ళను కలవడానికి, కథ వివరించి ఒప్పించడానికి టైం పడుతుంది. ఆ కారణంగానే రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 2023 సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అని స్పష్టమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు