తమిళ దర్శకులతో చేసిన ప్రతీసారీ ప్లాప్ లు మూటగట్టుకున్నాడు గోపీచంద్. ‘ఆక్సిజన్’ ‘చాణక్య’ చిత్రాలు గోపీచంద్ స్థాయిని కిందికి పడేశాయి. ప్రస్తుతం అతను క్రేజీ దర్శకులతో సినిమాలు చేసుకుంటున్నాడు. ‘సీటీమార్’ మినీ హిట్ అనిపించుకుంది.మారుతీతో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడు దీని పై మంచి బజ్ ఉంది.శ్రీవాస్ సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నదే. ఇలాంటి టైంలో ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి గోపీచంద్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అతను మరెవరో కాదు ‘సింగం’ సిరీస్ తో ఇక్కడ పాపులర్ అయిన హరి.
ఈయన సినిమాల్లో కొన్ని చేజింగ్ సీన్లు చూస్తే.. ‘కార్లకి కూడా కెమెరాలు కట్టేస్తాడా’ అన్నట్టు ఉంటుంది. అలాంటి ఈ మాస్ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఫామ్లో లేడు. ఈ మధ్యకాలంలో అతను తీసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు అతను గోపీచంద్ ను పట్టాడట. తమిళ హీరోలు హరితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఓకె చెప్పినవాళ్ళు ఖాళీగా లేరు. అందుకే తెలుగులో సినిమా చేస్తే ఈ గ్యాప్ ను ఫిల్ చేయవచ్చు అనేది అతని ఉద్దేశం కావచ్చు. ఈ చిత్రాన్ని భగవాన్..పుల్లారావులు నిర్మించబోతున్నారట. గతంలో వీళ్ళు గోపీచంద్ తో ‘శంఖం’ ‘గౌతమ్ నంద’ అనే ప్లాప్ సినిమాలు చేశారు. మరోపక్క గోపీచంద్ అభిమానులు మాత్రం తమిళ దర్శకుల జోలికి పోవద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.