సుమ ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి కదా..!

బుల్లితెర పై ఆమె తిరుగులేని స్టార్. అందులో డౌటే లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కూడా నటించింది.’వర్షం’ ‘బాద్ షా’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమాలో నటించింది. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకుడు. మే 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమ నటించింది కాబట్టి మొదటి నుండీ ఈ మూవీకి మంచి ఓటిటి ఆఫర్లు వచ్చాయి. కానీ సుమ, దర్శకుడు పట్టుబట్టి థియేట్రికల్ రిలీజ్ చేయించుకున్నారు. రిలీజ్ కు ముందు భారీగా ప్రమోషన్లు చేయించారు. వాటి లెక్క సినిమా బడ్జెట్ లో 10 శాతం ఉంటుందని ఇన్సైడ్ టాక్.

అనుకున్నట్టే థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే ప్రేక్షకులు పెదవి విరిచారు. సుమని బుల్లితెర పై చూస్తేనే బెటర్, అక్కడ ఈమె స్టార్.. ఇక్కడ ఈమె కష్టపడుతుంటే చూడలేకపోయాం అంటూ కొంతమంది ప్రేక్షకులు కామెంట్లు చేశారు. ప్రమోషన్లు మొత్తం సుమ దగ్గరుండి చూసుకుంది. చాలా వరకు ఆమెనే ఖర్చు పెట్టింది అని వినికిడి. టాలీవుడ్లో ఉన్న స్టార్లు అందరితో ఈ మూవీకి ప్రమోషన్లు చేయించింది. సుమకి తన కొడుకుని హీరోగా లాంచ్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఒకటి. ఛాన్స్ దొరికిన ప్రతీసారి స్టార్లకి తన కొడుకు గురించి చెబుతూనే వచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత సుమని పట్టించుకున్నవాళ్లు లేరు. మళ్ళీ ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది. ‘జయమ్మ పంచాయితీ’ ప్రమోషన్ల కోసం ఆమె పెట్టిన ఖర్చుకి ఇంకో రెండు మూడు షోలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది అని ఇన్సైడ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు