టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ అనేవి కొత్తవి ఏమి కాదు,
ఎప్పటినుంచో జరుగుతున్నవే , ఈ మధ్యకాలంలో మల్టి స్టారర్ సినిమాలు రావడం వలన ఫ్యాన్ వార్స్ కొంచెం తగ్గాయి అని చెప్పొచ్చు.
కానీ స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పవర్ స్టార్, సూపర్ స్టార్ అభిమానులు ఈ ఫ్యాన్ వార్స్ గట్టిగా జరుగుతాయి.
సోషల్ మీడియా లో లేని టైంలో ఒకరితో ఒకరు ఆర్గ్యు చేసుకునేవాళ్ళు,
సోషల్ మీడియా వచ్చిన తరువాత ఒకరి హీరోపై మరొక హీరో ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా రిలీజ్ కి రెడీ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి భీమ్లా నాయక్ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్, రేటింగ్స్ వస్తే చాలు. ఖచ్చితంగా మొదటివారంలోనే భీమ్లా నాయక్ సినిమా కలక్షన్స్ ను దాటేస్తుంది అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయం.
నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవ్వడు పోటీ రాడు , రాలేడు
ఎందుకంటే నాకు నేనే పోటీ , నాతో నాకే పోటీ అంటాడు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్. సేమ్ డైలాగ్ ను పవన్ ఫ్యాన్స్ రియల్ లైఫ్ లో వాడుతున్నారు. మా హీరో కి అసలు మీ హీరో పోటీనే కాదు అనేది పవన్ ఫ్యాన్స్ ఉద్దేశ్యం. వాస్తవంగా చెప్పాలి అంటే అభిమానులు అంతా అలా ఉండరు ఇదంతా కొంతమంది మధ్య. అప్పట్లో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ “మేము మేము బాగానే ఉంటాం – మీరు మీరే ఇంకా బాగుండాలి” అని చెప్పినప్పుడు ఈ మాటలు చాలా అభిమానులకి కనెక్ట్ అయి, కొంతమేరకు మార్పును కూడా తీసుకుని వచ్చాయి.