RGV : హీరోయిన్ల కెరీర్ నాశనం చేస్తున్న ఆర్జీవీ… వీళ్లంతా బలే!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు శివ లాంటి సినిమాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం పొలిటికల్ ఎజెండాతో వచ్చే సినిమాలు, రొమాంటిక్ సినిమాలకు పరిమితమైపోయారు. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా మందుతో, మగువతోనే ఎక్కువగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. కానీ చాలామంది హీరోయిన్లు ఆర్జివి చేతిలో తమ కెరీర్ ను పెట్టేసి బలైపోతున్నారు. ఆర్జీవి వల్ల కొంత మంది హీరోయిన్లకు పాపులర్ అయితే అవుతున్నారు. కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు. మరి ఇప్పటిదాకా ఆర్జీవీ వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్లు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే….

పాపులారిటీ ఫుల్… అవకాశాలు నిల్…
ఆర్జివి ఏం చేసినా అది సెన్సేషనల్ గానే మారుతుంది. ముఖ్యంగా పాపులారిటీ కావాలి అనుకునే వాళ్లు ఆర్జీవితో కలిసి కనిపిస్తే చాలు. వాళ్ళ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆర్జీవి ఆయనకు నచ్చిన అమ్మాయిల గురించి, తనను అట్రాక్ట్ చేసిన అమ్మాయిల గురించి స్పెషల్ పోస్టులు పెట్టి మరి ఫ్రీ పబ్లిసిటీని ఇచ్చేస్తుంటారు. అయితే పాపులారిటీ కావలసినంత దక్కుతుంది ఆర్జీవీ పరిచయం చేసే అమ్మాయిలకు. కానీ అవకాశాలు మాత్రం దక్కవు. ఈ విషయం తెలిసినప్పటికీ ఇంకా పాపులారిటీ కోసం ఆర్జీవిని పట్టుకుని కొంతమంది ముద్దుగుమ్మలు వేలాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం ఆయన సినిమాల్లో మాత్రమే హీరోయిన్లుగా నటించే అవకాశం దక్కుతుంది వాళ్లకు. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్లకు పిలుపు రావట్లేదు.

ఆర్జీవి వల్ల పాపులర్ అయిన హీరోయిన్లు…

- Advertisement -

గతం సంగతి పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో రామ్ గోపాల్ వర్మ వల్ల పాపులర్ అయిన హీరోయిన్లలో అప్సర రాణి, శ్రీ రాపాక వంటి వారు ఉన్నారు. నగ్నం మూవీతో శ్రీ రాపాక, థ్రిల్లర్, డేంజరస్ సినిమాలతో అప్సర రాణిని హీరోయిన్లుగా మార్చారు ఆర్జీవి. డేంజరస్ మూవీతో నైనా గంగూలీ కూడా పరిచయం అయ్యింది. ఆర్జీవి రీసెంట్ గా తీసిన మరో మూవీ “లడ్కీ” ద్వారా పూజా భలేకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. వీళ్లలో అప్సర రాణి మాత్రమే ఆర్జీవి సినిమాలు కాకుండా మరో రెండు మూడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. మిగతా వారంతా పత్తా లేకుండా పోయారు. అరియనా గ్లోరీ, అషూ రెడ్డి, ఇనాయా సుల్తానా కూడా ఆర్జీవి వల్లనే పాపులర్ అయ్యారు. కానీ వీళ్లంటే జనాలకు వెగటు పుట్టేసింది. మరోవైపు ఆఫర్లు కూడా లేవు. ఇప్పుడు ఆర్జీవి కన్ను సారీతో అందరి మనసును దోచుకున్న శ్రీలక్ష్మి సతీష్ పై పడింది. సోషల్ మీడియాలో పద్ధతిగా చీర కట్టుకుని అందరిని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడి కట్టు బొట్టును పూర్తిగా మార్చేశాడు ఆర్జీవి. ఆమె రెచ్చిపోయి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మొత్తానికి మరో అప్కమింగ్ హీరోయిన్ కెరీర్ ఆర్జీవి వల్ల నాశనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి శ్రీలక్ష్మి కెరీర్ ముందుముందు ఎలా ఉండబోతోందో చూడాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు