Singam 4 Update : “సింగం 4” సాధ్యమేనా…? డైరెక్టర్ రియాక్షన్ ఇదే

Singam 4 Update : సింగం సిరీస్ లో వచ్చిన సినిమాలు కోలీవుడ్ లో సూర్యను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టాయి. సింగం ముందు వరకు ఎక్కువగా క్లాస్ అండ్ యాక్షన్ సినిమాల్లోనే కనిపించిన సూర్య లోని మాస్ యాంగిల్ ఈ మూవీ ద్వారానే బయటపడింది. డైరెక్టర్ హరి డిఫరెంట్ స్టైల్లో సూర్య లోని మాస్ టాలెంట్ ను సింగం మూవీ ద్వారా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో దొరై సింగం అనే పోలీస్ ఆఫీసర్ గా సూర్య యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఆయన అభిమానులను ఉర్రూతలూగించాయి. రేసీ స్క్రీన్ ప్లే, పవర్ ఫుల్ యాక్షన్ అంశాలకు రొమాన్స్ ను జోడించి డైరెక్టర్ హరి సింగం సిరీస్ ను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. తాజాగా డైరెక్టర్ హరి “సింగం 4” ఎప్పుడు? అనే అప్డేట్ ఇచ్చారు. మరి ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

“సింగం 4′ లేటెస్ట్ అప్డేట్…

కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ హరి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సామి, సింగం సిరీస్, ఆరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ “రత్నం” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో “రత్నం” మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ హరి “సింగం 4” గురించి మాట్లాడారు.

తను ఎక్కడికి వెళ్లినా సింగం 4 గురించే అడుగుతున్నారని అన్నారు. అయితే ఇది హ్యాట్రిక్ హిట్ మూవీ కాబట్టి, నెక్స్ట్ భాగాన్ని పట్టాలెక్కించడానికి తను మరింత వర్క్ చేయాల్సి ఉంటుందని, ఇంకా సమయం పడుతుందని వెల్లడించారు. ఇక తనకు, సూర్యకు మధ్య ఎలాంటి సమస్య లేదని, “సింగం 4” ఎప్పుడు పట్టాలెక్కాలి అన్నది కాలమే నిర్ణయిస్తుందని డైరెక్టర్ హరి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పట్లో “సింగం 4” వర్కౌట్ అయ్యే అవకాశం లేదని తేల్చేశారు.

- Advertisement -

సూర్య – హరి కాంబో స్పెషల్…

హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్ కు కోలీవుడ్లో ప్రత్యేక మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే మాస్ ఆడియన్స్ కు పండగే అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబోలో ముందుగా వేల్ అనే మూవీ వచ్చింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ “ఆరు” చేశారు. ఆపై సింగం అనే మాస్ హిట్ మూవీని సూర్యకు ఇచ్చారు డైరెక్టర్ హరి. సూర్య కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ మొదటి రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ మూడో పార్ట్ మాత్రం పెద్దగా ఆడలేదు. 2010 నుంచి 2017 వరకు సింగం సాగా సాగింది.

2017లో చివరగా సింగం 3 రిలీజ్ అయింది. కానీ ఫ్లాఫ్ అవ్వడంతో సూర్య లయన్ మోడ్ నుంచి బయటకు వచ్చేసి వేరే సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. షూటింగ్ ప్రారంభం అవుతుంది అనుకున్న సమయంలోనే కరోనా రావడంతో లాక్డౌన్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. రెండేళ్ల క్రితమే సింగం 4 కోసం హరి స్క్రిప్ రెడీ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు ఈ సీక్వెల్. ఇకపై కూడా అనుమానమే. ప్రస్తుతం సూర్య “కంగువా” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు