Kantara: కాంతారా ప్రీక్వెల్ లో హీరోయిన్ గా సప్త సాగరాలు బ్యూటీ..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం కాంతారా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. హోంబలే ఫిలిం బ్యానర్ పైన తక్కువ బడ్జెట్ తో నిర్మించి భారీ లాభాన్ని అందుకున్నారు.. అందుకే ఈసారి కాంతారా ప్రీక్వెల్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు రిషబ్ శెట్టి.. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ వారు కూడా ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే స్టోరీ పనులు కూడా పూర్తయ్యాయని.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాంతారా ప్రీక్వెల్ లో హీరోయిన్ ఫిక్స్..

తాజాగా ఇందులో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. హీరోయిన్ గా సప్తసాగరాలు చిత్రంలో నటించిన రుక్మిణి వసంతిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవల ఆమెకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా చేశారని రిషబ్ శెట్టి రాసిన పాత్రకు ఆమె అన్ని రకాలుగా సరిపోవడంతో ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా సొంత టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో హీరో రిషబ్ శెట్టి కూడా ఎక్కువ మక్కువ చూపుతుంటారు.. అతని సినిమాకి పనిచేసే వారందరూ కూడా తనకు కావలసిన వాళ్ల లాగానే ఉంటారని ఎన్నో సందర్భాలలో తెలిపారు.

- Advertisement -

కాంతారా హీరోయిన్ ను అందుకే ఫిక్స్ చేశారు..

కాంతారాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.ఆమె కూడా కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఈమె కూడా ఆ సినిమాకి తగ్గట్టుగానే తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో కనిపించింది. ముఖ్యంగా అటు హీరో ఇటు హీరోయిన్ మధ్య కూడా కెమిస్ట్రీ కూడా చాలా న్యాచురల్ గా వున్నాయి.. సినిమాలో ఇవే హైలైట్ గా కనిపించాయి.. ఇప్పుడు రుక్మిణి ఎంపిక విషయంలో కూడా మరొకసారి ఇదే నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రుక్మిణి వసంత్ కెరియర్..

రుక్మిణి వసంత్ ఇప్పటికే కన్నడలో కొన్ని సినిమాలలో నటించింది.. అలాగే బాలీవుడ్లో అప్స్ స్టార్స్ అనే ఒక సినిమాలో తన కెరియర్ ప్రారంభంలోనే నటించిందట.. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సప్త సాగరాలు చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మని తెలుగులో లాంచ్ చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ట్రై చేశారట.. కానీ అది కుదరలేదని తెలుస్తోంది.. దీంతో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతోనే మరొకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. మరి ఈ సినిమా లాంచ్ అయితే రుక్మిణి కి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని పలువురు అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి కాంతారా ప్రీక్వెల్ విషయంలో రుక్మిణి గురించి చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు