Tollywood : తెలుగు హీరోలకు విలన్లు ఈ బాలీవుడ్ స్టార్స్… అవకాశాలు కరువు

ఇంతకుముందు ఇండియన్ సినిమా అనగానే బాలీవుడ్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. టాలీవుడ్ ను కనీసం పట్టించుకునే దిక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. బాలీవుడ్ లాంటి బడా సినిమా ఇండస్ట్రీని టాలీవుడ్ పై ఆధారపడే విధంగా చేశారు. చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు విలన్లుగా మారారు. ఇది కూడా మంచి పరిణామమే అయినప్పటికీ, ఇప్పటికే విలన్లుగా సౌత్ లో అదరగొడుతున్న కొంతమంది సీనియర్ యాక్టర్స్ కు వీళ్ల వల్ల చేతిలో పని లేకుండా పోతోంది. మరి ఇంతకీ సౌత్ లో విలన్లుగా రాణిస్తున్న ఆ బాలీవుడ్ స్టార్స్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

సౌత్ కు విలన్లు ఈ హిందీ హీరోలే…

నార్త్ హీరోలంతా ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక ట్రెండ్ కూడా వాళ్లకు తగినట్టుగా ఉండడంతో విలన్లంతా బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతుండడం విశేషం. పాన్ ఇండియా సినిమా తీసే మేకర్స్ అన్ని భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్ని భాషల నుంచి నటీనటులు తమ సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ విషయానికి వచ్చేసరికి విలన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ రాంపాల్, బాబి డియోల్, ఇమ్రాన్ హష్మీ, సంజయ్ దత్ వంటి స్టార్స్ అంతా పాన్ ఇండియా విలన్లుగా కొనసాగుతున్నారు. ఎలాగో బాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. కాబట్టి టాలీవుడ్ పై ఫోకస్ చేస్తే పనికి పని, అలాగే పాన్ ఇండియా క్రేజ్ కూడా దక్కుతుందని లెక్కలేసుకొని మరీ సౌత్ లోకి విలన్లుగా అడుగుపెడుతున్నారు ఈ నార్త్ నాయకులు.

- Advertisement -

ముందుగా సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలి. కేజిఎఫ్ 2 నుంచి మొదలు పెట్టిన సంజయ్ సౌత్ జర్నీ రాజా సాబ్, డబుల్ ఇస్మార్ట్, RC16 సినిమాలతో నిరాటంకంగా కొనసాగుతోంది. సంజయ్ ఇప్పటికే విలన్ గా 10 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటున్నట్టు సమాచారం. నెక్స్ట్ RC16 కోసం ఈయన మరింతగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ హవా నడుస్తోంది పాన్ ఇండియా విలన్ గా. ఆది పురుష్ సినిమాతో స్టార్ట్ చేసిన సైఫ్ ఇప్పుడు దేవర మూవీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ విలన్ ఎవరు అంటే? సన్నీ డియోల్ అని టక్కున చెప్పేస్తారు. బాబీ డియోల్ కు రీఎంట్రీ తర్వాత కాలం అలా కలిసి వస్తోంది మరి. ఇక యానిమల్ మూవీతో ఈయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం బాబి NBK109, హరిహర వీరమల్లు, కంగువా వంటి భారీ సినిమాల్లో విలన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. గూడచారి 2, ఓజి సినిమాలతో ఇమ్రాన్ హష్మీ విలన్ గా సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కూడా ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ బాలీవుడ్ స్టార్స్ అంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందాన బాలీవుడ్ ను వదిలేసి పాన్ వరల్డ్ గా ఎదుగుతున్న సౌత్ కు విలన్లుగా మారిపోయారు. అంతేకాదు భారీ పారితోషికాలు కూడా అందుకుంటున్నారు.

నష్టమా? లాభమా?

మరి ఈ బాలీవుడ్ బడా స్టార్ లంతా ఇలా విలన్లుగా మారి పాన్ ఇండియా సినిమా అవకాశాలను పట్టేయడం లాభమా నష్టమా? అంటే రెండు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకుల కోసం అన్నట్టుగా ఇలా బాలీవుడ్ స్టార్స్ ఉండడం మంచిదే. కానీ వీళ్ళ వల్ల ఇప్పటికే సౌత్ లో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులకు అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఇది నష్టం అనే చెప్పాలి. ఇప్పటికే తమ టాలెంట్ ను నిరూపించుకున్న ఎందరో సీనియర్ నటులు సౌత్ లో ఉన్నారు. వాళ్లందర్నీ పక్కన పెట్టేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ మేకర్స్ ఇలా నార్త్ స్టార్స్ ను విలన్లుగా చేస్తూ వాళ్ల వెంట పడడం వల్ల వీళ్ళు కనుమరుగైపోతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరు అని అన్నట్టుగా, పాన్ ఇండియా సినిమాల్లో విలన్లుగా నటించే అవకాశాన్ని సౌత్ నటులకు ఇవ్వరు అనే నింద వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు