Deepika Padukone : కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన దీపికా

బాలీవుడ్ డ్యూటీ దీపికా పదుకొనే ఫుల్ గా మనీ మైండెడ్ అయిపోయింది. ఓవైపు సినిమాలు, యాడ్లు చేస్తూనే మరోవైపు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసి రెండు చేతులా సంపాదించడానికి అదిరిపోయే ప్లాన్ వేసింది. కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు తన రేంజ్ కు తగ్గట్టుగానే దిమ్మ తిరిగే ధరలతో అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ దీపిక స్టార్ట్ చేసిన ఆ కొత్త బిజినెస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కొత్త దుకాణం తెరిచిన దీపిక…

సాధారణంగా సెలబ్రిటీలు సినిమాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ పరంగా కూడా రాణిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోలు బిజినెస్ మాన్లుగా మారి అదరగొడుతుంటే మేమేం తక్కువ అన్నట్టుగా హీరోయిన్లు కూడా బిజినెస్ ఉమెన్లుగా కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొనే ఓ హోం ఫర్నిషింగ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ బిజినెస్ ను ఆమె నేరుగా చేయకపోవడం గమనార్హం. రీసెంట్ గా ఆర్కిటెక్చర్ డైజెస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొత్త బిజినెస్ కు సంబంధించిన వివరాలను దీపిక వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పాటరీ బార్న్ తో కలిసి కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది దీపిక. అందులో భాగంగానే ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్, పలు వస్తువులను, కిచెన్ వాడే వస్తువులను భారీ రేట్లకు అమ్ముతున్నారని తెలుస్తోంది. ఫర్నిచర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇళ్లల్లోకి సెలబ్రిటీలు మాత్రమే కొనేలా లగ్జరీ ఐటమ్స్ ను షాకింగ్ ధరలకు అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. డిన్నర్ వేర్ నుంచి దిండ్లు, బెడ్ షీట్లు, వుడెన్ ఫర్నిచర్ వంటి వస్తువులని భారీ ధరలకు పాటరీ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉన్న క్యాండిల్స్ సెట్ ఏ మూడు వేలు అంటే ఏ రేంజ్ లో రేట్లు పెట్టి అమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. 2022 డిసెంబర్లో పాటరీ బార్న్ కు దీపిక బ్రాండ్ అంబాసిడర్ అయింది. అయితే రెండేళ్ల పాటు దీనిపై శ్రమించి ఇండియాలోనూ లాంచ్ చేశారు. అయితే ఇది ప్రత్యేకంగా ధనవంతులు, సెలబ్రిటీల కోసం మాత్రమే. అందులో ఉన్న ధరల ప్రకారం చూస్తే సాధారణ ప్రజలు ఆ బ్రాండెడ్ వస్తువులను కొనడం కష్ట సాధ్యమే.

- Advertisement -

పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్…

దీపికా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే… త్వరలోనే తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ బ్యూటీ. 2024 సెప్టెంబర్ లో తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దీపిక, రన్వీర్ జంట అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరోవైపు దీపిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి”లో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అయితే “కల్కి” రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు వరుసగా యాడ్స్ లో దర్శనం ఇస్తోంది ఈ బాలీవుడ్ క్వీన్.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు