Lavanya Tripathi : ఏం పాదంరా అయ్యా… అడుగు పెట్టిందో లేదో వరుణ్ కు దెబ్బ పడింది !

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఫ్యామిలీ కోడలైపోయింది. గత కొన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే మెగా ఫ్యామిలీ సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఆమె అలా అడుగు పెట్టిందో లేదో ఇలా వరుణ్ మూవీకి దెబ్బ పడింది. ఇటీవలే మెగా ఫ్యాన్స్ అంతా లావణ్య కాలు పెట్టిన వేళా విశేషం… ఆడపడుచు జీవితాన్ని చక్కదిద్దుతోంది. నిహారిక, ఆమె భర్త చైతన్యతో మళ్ళీ కలిసిపోబోతోంది అంటూ ముసిరిసిపోయారు. అదంతా మూడు రోజుల ముచ్చటే అన్పిస్తోంది తాజా పరిస్థితులు చూస్తోంటే. అసలేం జరిగింది అంటే…

వరుణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ గా తన సత్తాను చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. అయితే తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ స్టార్ట్ కాకుండానే సమస్యల్లో పడింది. యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కు దాదాపు రెండేళ్ల నుంచి సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ మూవీ “గాంధీవదారి అర్జున” ఆయన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఆ మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియదు. ఇక ఇటీవలే తన ప్రేయసి, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వైభవంగా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పై దృష్టి పెట్టాడు. ‘పలాస’ ఫ్రేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీకి ఇప్పటికే ‘మట్కా’ అనే టైటిల్ ను ప్రకటించారు. వరుణ్ తేజ్ కు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, ఆయన సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ మూవీ విశాఖపట్నంలో 1960 కాలం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం వరుణ్ తేజ్ కు షాక్ ఇస్తూ ఈ సినిమా విషయంలో పునరాలోచనలో పడ్డారట. ప్రస్తుతం వరుణ్ తేజ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ విషయంలో డైలమాలో పడ్డారట. నిజానికి వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో “మట్కా” మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే బడ్జెట్లో కోతలు పెట్టాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

- Advertisement -

సినిమా స్టార్ట్ చేసి ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా ముందే హీరో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను సరి చేయడం నిర్మాతలు తీసుకున్న తెలివైన డిసిషన్. అయితే కొంతమంది మాత్రం వరుణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇలా హోల్డ్ లలో పడడానికి కారణం ఆయన భార్య లావణ్య త్రిపాఠి అంటున్నారు. ఏం పాదంరా అయ్యా… అడుగు పెట్టిందో లేదో వరుణ్ కు దెబ్బ పడింది అంటూ కామెంట్ చేస్తున్నారు

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు