Family Star : అవుట్ పుట్ అసలేం బాలేదు… దిల్ రాజు షాకింగ్ డెసిషన్

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ ప్రేక్షకులు మిస్ కాకూడదు అని అనుకున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” కూడా ఒకటి. “గీతా గోవిందం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ పరుశురాం కాంబో “ఫ్యామిలీ స్టార్”తో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో మోస్ట్ హపెనింగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రొమాన్స్ చేయనుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఓ రేంజ్ లో హైప్ పెరిగిపోయింది. 2024 జనవరి 13న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అప్పుడే ప్రకటించారు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలామంది స్టార్ హీరోలు పోటీ పడుతుండడంతో ఫామిలీ స్టార్ పోస్ట్ పోన్ అవుతుందంటూ రూమర్స్ వచ్చాయి. ఇప్పటిదాకా మేకర్స్ ఈ రూమర్స్ పై అసలు స్పందించనే లేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో షాకింగ్ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

సినిమా వర్గాల సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పటికే “గుంటూరు కారం”, “హనుమాన్”, “సైంధవ్” వంటి కొన్ని సినిమాలను ఈ సంక్రాంతికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ కారణం తోనే “ఫ్యామిలీ స్టార్”ని పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నాడని చాలామంది భావించారు. అయితే “ఫ్యామిలీ స్టార్” పోస్ట్ పోన్ వెనకున్న అసలు రీజన్ వేరే నట.

“ఫ్యామిలీ స్టార్” మూవీకి సంబంధించిన షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తయింది. అయితే డైరెక్టర్ పరుశురాం డైరెక్ట్ చేసిన కొన్ని సన్నివేశాలపై దిల్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఇప్పటిదాకా వచ్చిన “ఫ్యామిలీ స్టార్” అవుట్ పుట్ అసలేం బాగాలేదని, అందుకే సినిమాను పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యారట. దిల్ రాజు సాధారణంగానే తన సినిమా మేకింగ్ తర్వాత ఎడిటింగ్ రూమ్లో మూవీని చూసి నిర్ణయం తీసుకుంటారని టాక్. ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” విషయంలో కూడా అదే జరిగింది.

- Advertisement -

ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే మరో విషయం ఏమిటంటే… “ఫ్యామిలీ స్టార్” మూవీ షూటింగ్ లో చాలా భాగం అమెరికాలో చిత్రించాల్సి ఉండగా, దిల్ రాజు మాత్రం ఇప్పటి దాకా చేసిన షూటింగ్ ను పక్కన పెట్టి, అందులో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని పట్టుబట్టినట్లు టాక్ నడుస్తోంది. ఇది నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండకు కూడా ప్రస్తుతం హిట్ పడడం చాలా ముఖ్యం. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ ఖాతాలో ఆ రేంజ్ లో ఒక్క హిట్ మూవీ కూడా పడలేదు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు