Amardeep: అలాంటి వ్యాధితో బాధపడుతున్న అమర్ దీప్.. అయినా తగ్గేదేలే..!

అమర్ దీప్.. ప్రస్తుతం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో మాట తీరుతో అందరి మనసులు దోచుకున్న సీరియల్ హీరో అమర్ దీప్ అంటే చాలామందికి ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయారని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా అన్యాయం జరుగుతోంది అంటే అది అమర్ కి మాత్రమే అని చెప్పాలి. శివాజీ పదేపదే అమర్ ను హేళన చేస్తూ.. మానసిక ధైర్యాన్ని కోల్పోయేలా మాట్లాడుతూ.. మెంటల్ టార్చర్ చేస్తున్నా.. అమర్ ఏ మాత్రం కృంగిపోకుండా నవ్వుతూ సరదాగా తీసుకుంటూ.. లోలోపల చాలా బాధను అనుభవిస్తున్నారు.

అందుకే మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆ బాధ , ఆవేశాన్ని అంతా ఆయన కన్నీటి రూపంలో బయటపెట్టారని చెప్పాలి. అయినా సరే ఈ విషయాన్ని బిగ్ బాస్ చాలా లైట్ తీసుకుంటున్నాడని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా హౌస్ లో అమర్దీప్ అస్వస్థతకు లోనవ్వగా ఫిట్స్ వచ్చి పడిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి చికిత్స కూడా చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా అతని స్నేహితుడు, ప్రముఖ నటుడు నరేష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

నరేష్ మాట్లాడుతూ.. అమర్ దీప్ నిజంగానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని వెల్లడించారు. నీతోనే డాన్స్ షోలో శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమయ్యాడని.. అందుకే ఫిట్స్ వచ్చాయని నరేష్ వెల్లడించారు. ఇకపోతే కండరాల ఎదుగుదల లోపించిందని ..విశ్రాంతి తీసుకోకుండా పనిచేయడం వల్లే ఇబ్బంది పడ్డాడు అని నరేష్ వెల్లడించారు. ఇక ఆయన మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా అమర్ శరీరంలో కండరాల ఎదుగుదల లేదు అని , రెండు నెలల నుంచి ఎదుగుదల లేకపోవడం వల్లే అతడికి ఫిట్స్ రావడానికి కారణం అయ్యిందని.. అయితే బిగ్బాస్ షో కి వెళ్లే రెండు రోజుల ముందు మాత్రమే కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోయాడని.. తాను ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వడం సరిగా నిద్రపోకపోవడం వల్లే శరీరం సహకరించడం లేదు.. అయినా సరే ఎక్కడ ఈ విషయాన్ని చెప్పకుండా తన గేమ్ తాను ఆడుతూ సమస్యను కూడా లెక్కచేయకుండా దూసుకుపోతున్నాడు అంటూ అమర్దీప్ గురించి నరేష్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇక ఈ విషయం తెలిసి అందరూ అమర్ దీప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆట ఆడాలి.. కప్పు గెలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో అమర్దీప్ తన ఆరోగ్య సమస్యను కూడా లెక్క చేయకపోవడం నిజంగా గ్రేట్ అంటూ అమర్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు