RC15: రామ్ చరణ్ ని ఢీ కొట్టేందుకు కోలీవుడ్ స్టార్.. ?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. శంకర్ మరియు చరణ్ కాంబో లో రాబోతున్న మొదటి సినిమా ఇది. RRR మూవీ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ నుంచి రాబోతున్న తర్వాత సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీగానే ఎక్సపెక్టషన్స్ వున్నాయి. ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. వీరిద్దరూ ఇది వరకే కలిసి నటించిన చిత్రం వినయ విదయ రామ. ఈ సినిమాలో వీరి జోడి కి మంచి కామెంట్స్ వచ్చాయి. అలాగే కియారా అద్వానీ నటన కి మంచి ప్రశంసలే వచ్చినా, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

కాగా ఈ సినిమాపై శంకర్ భారీ ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్న వార్త తెలిసిందే. ఇది మూవీ మేకర్స్ ప్రకటించలేదు కానీ, రామ్ చరణ్ తో పాటు శ్రీకాంత్ ఉన్న ఒక ఫోటో లీక్ అయింది. దీంతో RC15లో శ్రీకాంత్ కీలక పాత్ర చేస్తున్నట్టు కన్ఫామ్ అయింది. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా లో విలన్ గా కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

అజిత్ ఇప్పటి వరకు హీరో గానే నటించాడు. ఇటీవల సంక్రాంతి లో తెగింపు సినిమా తో మంచి హిట్ పొందాడు. ఇప్పుడు కూడా వరసగా ఫిలిమ్స్ తో బిజీ గా వున్న అజిత్, ఇలా నెగటివ్ పాత్రకి ఒప్పుకున్నాడా అనే డౌట్స్ వస్తున్నాయి. ఒక వేళ అజిత్ విలన్ రోల్ కి ఒప్పుకుంటే.. సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు