Custody : టీజర్ డేట్ అనౌన్స్..

నాగచైతన్య చేస్తున్న సినిమాలు అన్ని వరసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. ఈ అక్కినేని హీరో నుంచి ఇటీవల వచ్చిన థాంక్యూ మూవీ నెగిటివ్ టాక్.. రివ్యూలను తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ కి లాల్ సింగ్ చద్దా మూవీ తో ఎంట్రీ ఇచ్చిన చైతన్య కి అక్కడ కూడా ఎదురు దెబ్బె తగిలింది. దీని తర్వాత నాగ చైతన్య తర్వాత సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. అందుకోసం నాగ చైతన్య బాగానే కష్టపడ్తున్నట్టు తెలుస్తుంది.

కాగా, నాగ చైతన్య తర్వాత సినిమా కస్టడీ. ఇది వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతుంది. నాగ చైతన్య కి జోడిగా బాలీవుడ్ భామ కృతి శెట్టి నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ కస్టడీ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మార్చ్ 16 న సాయంత్రం 4:51 PM కి రాబోతుందని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో.. యస్.. ది వెయిట్ ఈజ్ ఓవర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో నాగ చైతన్య ఒక పోలీస్ కాన్‌స్టేబుల్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా చైతన్య కి ఇప్పుడు కెరీర్ లో ఒక హిట్ ఎంతగా అవసరమో, దాని కోసం చై ఎంత కష్టపడుతున్నాడో, ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూడాలంటే 16 న వస్తున్నా టీజర్ కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ప్రేక్షకులు చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు