Kiran Abbavaram: ఏమండోయ్ ఇది విన్నారా.. ఆ విషయం కిరణ్ అబ్బవరం కు మంచి డిమాండ్ ఉందట.. !

రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం తరుచు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కు గురి కావడం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం కిరణ్ అబ్బవరం చేసే సినిమాలే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. కెరీర్ బిగింగ్ లో ఒకటి రెండు మంచి సినిమాలు చేసిన కిరణ్, ఇక తరువాత ఇప్పటి వరకు ప్రేక్షకులకు నచ్చేలా ఆ ఒక్క సినిమా కూడా తీయలేకపోయాడు.

ఔట్ డేటెడ్ స్టోరీలను ఎంచుకుంటూ.. ఒకటి మించి మరొకటి ఫ్లాప్అయ్యేట్టుగా కేర్ లెస్ గా సినిమాలు చేస్తూ పోతున్న కిరణ్ అబ్బవరం కు ఒక విషయంలో మాత్రం మంచి డిమాండ్ ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

అదేంటంటే కిరణ్ అబ్బవరం సినిమాల పరంగా వరుస ఫ్లాప్ లనే డెలివరీ చేస్తున్న కూడా ఈ హీరో సినిమాల థియేట్రికల్ రైట్స్ కు మాత్రం మంచి డిమాండ్ లభిస్తుందట. అందుకే కిరణ్ అబ్బవరం సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆయనతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిజంగా మంచి విషయమనే చెప్పాలి.

- Advertisement -

కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు చేయనప్పటికీ .ఆ సినిమాలలో కేవలం మూడు సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. అందులో ఒక సినిమాకు స్వయంగా కిరణ్ అబ్బవరం కథను అందించటం విశేషం.ఇటీవలనే కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా రూల్స్ రంజాన్ రిలీజై డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంటానని చెప్పిన కిరణ్ అబ్బవరం కనీసం ఈ బ్రేక్ తరువాతనైన ప్రేక్షకులను అలరించే సినిమాలు తీస్తాడా లేదా అనేది చూడాలి..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు