Samantha: ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్స్ ఇచ్చిన సమంత..!

లేడి సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం మాయోసైటిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ట్రీట్మెంట్లో  భాగంగా ఇంట్రా వీనస్ న్యూట్రిషన్ ( IntraVenous Nutrition ) ట్రీట్మెంట్ తీసుకుంటున్న సామ్, ప్రాసెస్ గురించి వివరిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది.

ఇమ్యూనిటీ బూస్ట్ ప్రాసెస్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం, వైట్ బ్లడ్ సెల్స్ డెవలప్ అవ్వటం, రాకారకాల వైరస్ లను ఎదుర్కోవటానికి అవసరమైన ఇమ్యూనిటీ లభించటం వంటి బెనిఫిట్స్ ఉంటాయని తెలిపింది. ఈ ట్రీట్మెంట్ మాయోసైటిస్ వ్యాధి నుండి రికవర్ అవ్వటానికి హెల్ప్ అవ్వటమే కాకుండా ఇంకా చాలా వ్యాధుల ట్రీట్మెంట్ కోసం వాడతారని పోస్ట్ లో తెలిపింది సమంత.

సమంత షేర్ చేసిన టిప్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. తన డిసీజ్ గురించి దాచిపెట్టకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న సమంత స్పోర్టివ్ నెస్ కి హ్యాట్సాఫ్ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ కి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వస్తోంది సమంత.

- Advertisement -

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మాయోసైటిస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ట్రీట్మెంట్ కి వెళ్ళకముందు సమంత విజయ్ తో కలిసి నటించిన  ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో ఫ్యాన్స్ సమంత కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కలిసి నటించిన నేపథ్యంలో కమ్ బ్యాక్ తర్వాత సమంత బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతుందా లేక సౌత్ లోనే నటిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు