Kajal Agarwal : కాజల్ కండిషన్లకు పారిపోతున్న డైరెక్టర్స్… తల్లయ్యాక కూడా డిమాండ్సా?

Kajal Agarwal : సీనియర్ హీరోయిన్లు ఈ మధ్య పెళ్లయినా, తల్లులైనా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో డిమాండ్లు చేస్తూ మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. పెళ్లయ్యాక కూడా తమ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో కండిషన్స్ తో దర్శకులను తెగ భయపెడుతున్నారు. తాజాగా కాజల్ కండిషన్స్ కి డైరెక్టర్స్ పారిపోయే పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతోంది. మరి దర్శకులను అంతగా టెన్షన్ పెట్టేస్తున్న కాజల్ కండిషన్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

కంటెంట్ ముఖ్యం బిగిలూ

ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్లంతా సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ కూడా ఇప్పుడు మొదలు పెట్టేసింది. ఇదివరకు హీరోయిన్లకు పెళ్లయ్యాక పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్లు చేతిలో వరుస సినిమాలను పెట్టుకుని, కెరీర్ పీక్స్ లో సాగుతున్నప్పుడే పెళ్లికి కమిట్ అవుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దీంతో పెళ్లయ్యాక చేతిలో అవకాశాలు లేవు అన్న టెన్షన్ ఉండదు కదా. పెళ్లే కాదు పిల్లలు పుట్టాక కూడా గ్లామర్ ఒలకబోయడానికి ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు కొంతమంది ముద్దుగుమ్మలు. ఈ లిస్ట్ లో కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఈ హీరోయిన్ ప్రయారిటీస్ మారిపోయాయని తెలుస్తోంది. కాజల్ తో పాటు కెరీర్ మొదట్లో రెమ్యూనరేషనే ప్రధాన లక్ష్యంగా గ్లామర్ రోల్స్ చేయడానికి వెనకాడని హీరోయిన్లంతా ఇప్పుడు మాత్రం కంటెంట్ ముఖ్యం బిగులూ అంటున్నారు.

కాజల్ కండిషన్ కరెక్టే

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేతిలో ఉన్న కాజల్ డైరెక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోయే కొత్త కండిషన్స్ పెడుతోందట. చందమామ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ దాదాపుగా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీనియర్ హీరోలతో పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 అనే భారీ బడ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తను నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో లిమిట్స్ పెట్టేస్తోందట కాజల్.

- Advertisement -

లిప్ లాక్ లు లేదా ఎక్స్పోజింగ్ లాంటి పాత్రలు అస్సలు చేయనని చెప్పుకొస్తోందట. తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ లో సగం తగ్గించినా పర్లేదు కానీ తన భర్తను ఇబ్బంది పెట్టే పాత్రలు మాత్రం ఎప్పటికీ చేయను అని ఏమాత్రం మొహమాటం లేకుండా డైరెక్టర్లకు ముఖం మీద చెప్పేస్తుందట. అయితే పెళ్లయి పిల్లాడు పుట్టాక కూడా కాజల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఆమెకు ఇంకా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి టైంలో కాజల్ ఇలా కండిషన్స్ పెడుతూ డైరెక్టర్లను ఓ ఆట ఆడుకుంటోంది. మరి ఇలాంటి కండిషన్స్ ఉంటే సోషల్ మీడియాలో అలా రెచ్చిపోయి ఫోటోషూట్లు ఎందుకు చేస్తున్నట్టు ? అంటే ఈ కండిషన్ వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు