Kollywood: కృతి శెట్టిని టార్చర్ చేస్తున్న హీరో కొడుకు ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కృతి శెట్టి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు మాత్రం… పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందట. ఉప్పన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి…. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది.

ఉప్పెన తర్వాత… కృతి శెట్టి కి లైఫ్ ఇచ్చిన సినిమా ఏదీ కూడా లేదు. అయినప్పటికీ ఆమెకు ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇక త్వరలోనే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనుంది ఈ బ్యూటీ. హీరో విశాల్ తో కొత్త సినిమా చేయనుందట కృతి శెట్టి. అయితే తాజాగా కృతిశెట్టి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ బ్యూటీని కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో కొడుకు చాలా వేధిస్తున్నాడట. కృతి శెట్టి ఎక్కడికి వెళ్లినా… అక్కడికి వెళ్లి… క్లోజ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడట. ఆమెతో ఫ్రెండ్షిప్ చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడట ఆ సదరు వ్యక్తి. అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో… అతనిపై కృతి శెట్టి… ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు