Baby: ప్యూర్ లవ్ స్టోరీ అనుకుంటే, ఈ ట్విస్ట్ ఏంటి..?

కలర్ ఫోటో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ స్వీయ రచనతో దర్శకత్వం వహించిన ‘బేబీ’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా స్టోరీ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించానని సాయి రేజేష్  గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. అయితే, ప్యూర్ లవ్ స్టోరీతో ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని అందరూ భావిస్తున్న క్రమంలో సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.
ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఒక పోస్టర్లో మిడిల్ ఫింగర్ మీద హీరోయిన్ నిలబడ్డట్టు ఉండటం, మరో పోస్టర్లో హీరోయిన్ పెదాల మధ్య బ్లేడ్ ఉండగా హీరో లిప్ లాక్ చేస్తున్నట్లు ఉండటంతో సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత ధాటికి సినిమా డైరెక్టర్ మిడిల్ ఫింగర్ పోస్టర్ ని తొలగిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన సాయి రాజేష్ సినిమా కథకి ఆ పోస్టర్లకు సంబంధం ఉందని అందుకే అలా డిజైన్ చేశామని వివరణ ఇచ్చాడు. నేషనల్ అవార్డు గ్రహీత నుండి వస్తున్న సినిమా కావటంతో నెలకొన్న భారీ అంచనాలను బేబీ చేరుకుంటుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు