Klin Kaara konidela: మెగా ప్రిన్సెస్ పేరుకి ఇంత అర్థం ఉందా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సుమారు పెళ్ళైన 11ఏళ్లకు రామ్ చరణ్ కి సంతానం కలగటంతో అటు మెగా అభిమానులు, ఇటు మీడియా వర్గాలు తెగ హడావిడి చేశాయి. ఈ నేపథ్యంలో నేడు బారసాల సందర్బంగా మనవరాలి పేరుని ప్రకటించాడు చిరు. తన పుట్టుకతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మెగా ప్రిన్సెస్ కి పేరు కూడా అదే రేంజ్ లో పెట్టారు. తన మనవరాలి పేరు ‘క్లిన్ కారా’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు మెగాస్టార్. ఈ పేరుని అమ్మవారి ‘లలితా సహస్ర నామం’ నుండి తీసుకున్నట్లు వెల్లడించాడు.
‘క్లిన్ కార’ అంటే ‘ఆధ్యాత్మిక చింతనను కలిగించే స్వచ్ఛమైన శక్తి’ అన్న అర్థం వస్తుందని తెలిపాడు మెగాస్టార్. ఈ యువరాణి పెరిగే కొద్దీ పేరుకి తగ్గ లక్షణాలను అలవరచుకుంటుందని తమ గట్టి నమ్మకం అని ఆశాభావం వ్యక్తం చేసాడు చిరంజీవి. కాగా, మెగా ప్రిన్సెస్ బారసాల సందర్భంగా ముకేశ్ అంబానీ ఒక బంగారు ఊయలని గిఫ్ట్ గా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయగా రామ్ చరణ్ అది అవాస్తవం అని స్పష్టం చేశాడు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరిగిన బారసాల వేడుకలో మెగా ప్రిన్సెస్ ని ప్రజ్వల ఫౌండేషన్ వారు పంపిన చెక్క ఊయలలోనే పాడుకోబెట్టమని క్లారిటీ ఇచ్చాడు. సాధారణంగా వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో మెగా ప్రిన్సెస్ కి ఇంతటి గొప్ప అర్థం వచ్చేలా పేరు పెట్టడం మెచ్చుకో దగ్గ అంశం అని చెప్పాలి.
https://twitter.com/KChiruTweets/status/1674731729540780033?s=20

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు