Sree Vsihnu: సామజవరాగమన ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ కి దీనికి సంబంధమే లేదు

శ్రీ విష్ణు హీరోగా నటించిన కామెడీ సినిమా “సామజవరగమన“. అసలే అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ప్రీమియర్ల తోనే మంచి టాక్ ఈ సినిమాకు వచ్చినందువల్ల ఫస్ట్ డే అయ్యే సరికి మంచి కలెక్షన్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ దీనికి రివర్స్ గా సినిమా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం గమనార్హం. జూన్29న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తక్కువ లొకేషన్లలో హౌస్ ఫుల్ అయ్యి డీసెంట్ స్టార్ట్ ని దక్కించుకుంది.

ఒక్కసారి సామజవరాగమన సినిమా ఏరియా వారి కలెక్షన్లను గమనిస్తే.. నైజాం 36 లక్షలు, సీడెడ్ 8లక్షలు, ఆంధ్ర 36లక్షలు రాబట్టగా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల షేర్ రాబట్టింది. ఇక ఇతర రాష్ట్రాల నుండి ఓవర్సీస్ కూడా కలుపుకుని మరో 34లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా సామజవరగమన చిత్రం ఫస్ట్ డే 1.14 కోట్ల షేర్ వసూలు చేయగా, 2.10కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సామజవరగమన సినిమా వరల్డ్ వైడ్ గా 3.55 కోట్ల టార్గెట్ తో రిలీజ్ కాగా, ఫస్ట్ డే కలెక్షన్లు తీసేయగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2.36కోట్లు వసూలు చేయాలి. అయితే ఈ సినిమాకి “స్పై” మూవీ పోటీగా రావడంతో ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం పడిందని చెప్పాలి. అయితే “స్పై” కి వచ్చిన మిక్సిడ్ రెస్పాన్స్ కి తోడు, సామజవరగమన సినిమా కి మంచి హిట్ టాక్ రావడంతో వీకెండ్ లో పుంజుకునే అవకాశం ఎంతైనా ఉంది. మరి చూద్దాం రెండో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు