Rashmika – Anirudh:కూల్ కూల్ గా.. సమ్మర్ స్పెషల్ అంటున్న రష్మిక – అనిరుధ్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల వరకు రష్మిక మొదటి ఆప్షన్ అవుతూ ఉండడం గమనార్హం. సినిమాలలో రష్మిక క్రేజ్ చూసిన పలు బిజినెస్ బ్రాండ్స్ కూడా తమ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం రష్మిక ఇమేజ్ ను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రష్మిక కూడా తన ఇమేజ్ ని ఉపయోగించుకుంటూ పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమ్మర్ రాబోతున్న నేపథ్యంలో కూల్ డ్రింక్ ప్రోడక్ట్ “7up ” కి సైన్ చేసింది రష్మిక. ఇక దీంతో ఈ బ్రాండ్ కోసం కొత్త యాడ్ కూడా చేసింది. ఈ యాడ్ లో రష్మిక తో పాటు తమిళ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా కనిపించారు.

ఇకపోతే ఈ యాడ్ చూడడానికి సినిమాటిక్ గా చాలా బాగుంది . ఈ యాడ్ ని రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ యాడ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ యాడ్ ను ఈమె అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.ఇక రష్మిక విషయానికి వస్తే.. రష్మిక తాజాగా ఒక ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకువచ్చారు.. తాజాగా మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము అంటూ హీరోయిన్ శ్రద్దా దాస్ తో ఉన్న ఫోటోని షేర్ చేశారు.. ఈ పోస్ట్ చూసినా అభిమానులు కంగారు పడిపోయి.. ఏం జరిగింది అంటూ కామెంట్లు కూడా చేశారు.

అసలు విషయంలోకి వెళ్తే రష్మిక మరియు శ్రద్ధ కలసి ముంబై నుంచి హైదరాబాదు ఫ్లైట్ లో బయలుదేరారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన అరగంటకి ఏదో సమస్య వల్ల మళ్ళీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.. ఈ విషయం గురించి తెలియజేస్తూ ఈ పోస్టు వేసినట్లు సమాచారం .. మొత్తానికి అయితే రష్మిక ఆ ప్రమాదం నుంచి తప్పుకుంది అని తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప – 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు