Sundeep kishan : ఈ హీరో ఇక ట్రాక్ లోకి ఎక్కినట్టేనా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన” విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్ని అవాంతరాలు దాటుకుని రిలీజ్ అయ్యిందో తెలిసిందే. పైగా సందీప్ కిషన్ కి కూడా చాలా ఏళ్లుగా సరైన హిట్ కూడా లేదు. ఈ క్రమంలో ఊరు పేరు భైరవ కోన సందీప్ కిషన్ కి ఊరట కలిగిస్తుందని చెప్పాలి. నిజానికి ఈ సినిమా అంత గొప్పగా ఏమి లేకపోయినా, వీకెండ్ లో మంచి కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువలో ఉంది. కనుక తొలివారం ముగిసే సరికి ఊరుపేరు భైరవ కోన ఆల్మోస్ట్ హిట్ స్టేటస్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా ఊరు పేరు భైరవకోన రిలీజ్ అయి హిట్ టాక్ అందుకోగానే సందీప్ కిషన్ తర్వాతి సినిమాలపై అప్పుడే డిస్కషన్ మొదలైంది. ఇప్ప్పటివరకూ కొత్త డైరెక్టర్లు, ప్లాపుల్లో ఉన్న దర్శకులు మాత్రమే సందీప్ కిషన్ చుట్టూ తిరగ్గా, తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక సూపర్ కాంబో లో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

సందీప్ కిషన్ హీరోగా ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని హాస్య మూవీస్ ఎకె బ్యానర్ కాంబినేషన్ లో ఈ సినిమా డిస్కషన్ లో వుంది అని వార్తలు వస్తున్నాయి. ఇంకా స్టోరీ డెవలప్ లో ఉన్నారని త్వరలో ఈ కాంబోలో సినిమాపై క్లారిటీ రానుందని సమాచారం. ఈలోపు సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉంటాడని సమాచారం.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు