RAPO: రామ్ – బోయపాటి సినిమా రిలీజ్ డేట్ మారిందా..?

ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ తో పవర్ఫుల్ గా కనిపించిన రామ్ బోయపాటి మార్క్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. చాలావరకు షూటింగ్ పూర్తైన ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకొని ముందే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అక్టోబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాంపిటీషన్ లో పడి నష్టం మూట కట్టుకునేకంటే పోటీ లేని సమయంలో రిలీజ్ చేసి సేఫ్ జోన్ లో ఉండాలని నిర్మాతలు భావిస్తున్నారట.

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని రామ్ కి ఈ సినిమా కీలకంగా మారింది. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ మారనుందని వార్తలొస్తున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట సినిమా యూనిట్.

రిలీజ్ డేట్ లో మార్పు ఉంటుందన్న విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని సమాచారం అందుతోంది. తెలుగు సహా ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమా రామ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ప్రస్తుతం చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్న నేపథ్యంలో హీరో రామ్ కూడా ఆ జాబితాలో చేరతాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. మరి, తనపైనే ఆశలు పెట్టుకున్న రామ్ కి బోయపాటి హిట్ ఇస్తాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు