Pawan Kalyan: మొత్తానికి బరిలోకి దిగిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’, సినిమాలను లైన్లో పెట్టాడు పవర్ స్టార్. ఇవే కాకుండా సాయి ధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో ‘వినోదాయ సీతాం’ అనే తమిళ సినిమా రీమేక్ గా రూపొందిన ‘బ్రో’ సినిమాలో కూడా నటించాడు. అయితే, ఇటీవల ప్రారంభమైన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు శరవేగంగా జరుపుకుంటుంటే, చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం నత్త నడకన సాగుతోంది.

బ్రో సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అవటంతో అప్పుడెప్పుడో మొదలైన  ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్లో పదిరోజుల పాటు చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గిననున్నాడని సమాచారం.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా, షూటింగ్ నత్తనడకన సాగటం వల్ల పలు మార్లు రిలీజ్ వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలో నటించటం వల్ల ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు