Raviteja: వేటకు సిద్ధమైన టైగర్ నాగేశ్వరరావు..!

ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా దర్శకుడు వంశీ డైరెక్షన్లో స్టూవర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సాగే ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. స్టువర్ట్ పురం బ్యాక్డ్రాప్ లో 1970నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు పాత్రలో ఔట్ అండ్ ఔట్ పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు రవితేజ. వెంకటేష్ వాయిస్ ఓవర్ తో పాటు, విజువల్స్, జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి.

‘జింకని వేటాడే పులిని చూసుంటావు, పులిని వేటాడే పులిని చూశావా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. రవితేజ సరసన నుపుర్ ఠాకూర్, గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రావణాసుర లాంటి డిజాస్టర్ అందుకున్న రవితేజకు ఈ సినిమా హిట్ అవ్వటం కీలకం అని చెప్పాలి.

నిజానికి టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతున్నా పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గ్లింప్స్ కి తెలుగులో వెంకటేష్, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళ్ లో కార్తీ, మలయంలో డుల్కర్ సల్మాన్ హిందీలో జాన్ అబ్రహం లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ అందుకొని ఊపు మీదున్న రవితేజకి రావణాసుర డిజాస్టర్ తో బ్రేక్ వేసింది. మరి, ఎన్నో అంచనాలతో రానున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకి పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు