Akkineni Family: కమ్ బ్యాక్ కి సిద్దమవుతున్న అక్కినేని హీరోలు..!

టాలీవుడ్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ హిట్స్ తో దూసుకుపోతుంటే అక్కినేని ఫ్యామిలీ మాత్రం బ్యాడ్ టైమ్ తో సతమతం అవుతుంది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురికీ ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. నాగార్జున కి రీసెంట్ గా ఘోస్ట్ సినిమా రూపంలో డిజాస్టర్ ఎదురైతే, నాగచైతన్య కి కస్టడీ రూపంలో డిజాస్టర్ వచ్చింది. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని అఖిల్ కి మరో డిజాస్టర్ తెచ్చి పెట్టింది. తమ అభిమాన హీరోలకు వరుసగా డిజాస్టర్స్ వస్తుండటం పట్ల అక్కినేని అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

వరుస డిజాస్టర్స్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అక్కినేని హీరోలు కొత్త సినిమాలు చేయాటానికి సిద్ధం అవుతున్నారు.రైటర్ బెజవాడ ప్రసన్న దర్శకత్వంలో నాగార్జున సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. జూన్ రెండో వారంలో ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్నాడు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రీసెంట్ గా కస్టడీ సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న నాగచైతన్య కూడా వరుసగా యువ దర్శకులతో స్టోరీ సిట్టింగ్స్ లో పగింతున్నాడని సమాచారం అందుతోంది.

ఈ క్రమంలో నెక్స్ట్ చేయబోయే సినిమాల ద్వారా అయినా వరుస డిజాస్టర్స్ పరంపరకు బ్రేక్ పడాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, అక్కినేని హీరోల వరుస డిజాస్టర్లు అన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చినవే కావటంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈసారైనా ఇంగ్లీష్ టైటిల్స్ తో కాకుండా తెలుగు టైటిల్స్ తో సినిమా చేసి తమ హీరోలు హిట్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు