Ravi Teja : సెట్ కాదని వదలుకున్నాడా ?

నందమూరి కళ్యాణ్ రామ్ కు ఉన్న క్రేజ్ తక్కువేం కాదు. వరుసగా ఫ్లాఫ్స్‌ వచ్చినా, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బింబిసార అనే రాజుగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడని టాక్ కూడా వినిపిస్తోంది.

టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బింబిసార సినిమాకు మొదట అనుకున్నది కళ్యాణ్ రామ్ ను కాదట. కళ్యాణ్ రామ్ పాత్ర కోసం మొదట మరొక హీరో దగ్గరికి వెళ్ళగా, ఆ హీరో రిజెక్ట్ చేయడంతో చివరికి కళ్యాణ్ రామ్ ను వరించిందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ.

వశిష్ట్ కథ అంత సిద్ధం చేసుకుని రవితేజ దగ్గరికి వెళ్లాడట. తాను ఈ కథకు సూట్ కానని, అలాంటి పాత్రలు చేయలేనని చెప్పాడట. అంతేకాదు కొత్త డైరెక్టర్ వశిష్ట్ ఈ విజువల్ వండర్ సినిమాను హ్యాండిల్ చేయలేడేమో అని రవితేజ అభిప్రాయపడ్డాడట. దాంతో అదే కథతో కళ్యాణ్ రామ్ దగ్గరికి దర్శకుడు వశిష్ట్ వెళ్లాడట. కళ్యాణ్ రామ్ సినిమా ప్రొడక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ చేతిలోకి వెళ్ళింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాక్స్‌ ఆఫీసు రికార్డులను తిరగరాస్తోన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు