REBEL: ‘డార్లింగ్’ కే అచ్చిరాని టైటిల్ డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి కలిసొస్తుందా?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా, డార్లింగ్ ప్రభాస్ గా, రెబల్ స్టార్ గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ర్ సంపాదించుకున్న ఈ హీరో స్టార్ కావడానికి ఎంతో కష్టపడ్డాడు. ఫ్యాన్స్ అందరూ రెబల్ స్టార్ అని పిలుచుకునే ఈ హీరో ఆ ట్యాగ్ ని సంపాదించుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాడు. నిజానికి పెదనాన్న కృష్ణం రాజు నుండే ఆ టైటిల్ వారసత్వంగా వచ్చినా, టైటిల్ ని నిలబెట్టుకోవడానికి ప్రభాస్ పడ్డ కష్టం మరో ఎత్తు.

అయితే ప్రభాస్ ఎంతో క్రేజ్ తెచ్చిన రెబల్ స్టార్ అన్న ట్యాగ్ తనకి సినిమా పేరుగా మాత్రం కలిసిరాలేదు. అవును.. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా “రెబల్”. 2011 లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవడమే గాకుండా, అప్పట్లో ట్రోలింగ్ కూడా గురయింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి కోలుకోడానికి ప్రభాస్ బాగానే టైం తీసుకున్నాడు.

అయితే లేటెస్ట్ గా అదే రెబల్ టైటిల్ తో తమిళ్ లో ఓ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ డార్లింగ్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జి.వి ప్రకాష్ కుమారే రెబల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నిన్ననే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాగా, నీకేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. కమ్యూనిజం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. మరి డార్లింగ్ ప్రభాస్ కే అచ్చిరాని రెబల్ టైటిల్ డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జి.వి. ప్రకాష్ కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు