Tiger Nageswara Rao Collection: 20 కోట్ల నష్టం తప్పదా? అంతా డైరెక్టర్ వల్లే…!

మాస్ మహరాజా రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దేశ వ్యాప్తంగా పేరుగాంచిన స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ కాబట్టి… మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఒకటే… డిసప్పాయింట్మెంట్. అది ఏంటంటే… ఈ భారీ ప్రాజెక్ట్‌ను పెద్దగా అనుభవం లేని చిన్న డైరెక్టర్‌ వంశీకి ఇవ్వడం. వంశీకి గతంలో దొంగాట అనే సినిమా చేశాడు. అది పెద్ద హిట్ అయిన మూవీ ఏం కాదు. ఇది మాస్ మహారాజా ఫ్యాన్స్ ను ఎప్పటి నుంచో కలవరపెడుతున్న అంశం.

కానీ, చిన్న హోప్. ఎలాంటి అనుభవం లేని వాళ్లు కూడా ఉప్పెన, దసరా, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేస్తున్నారు. అయితే వీరికి గురువు సుకుమార్. మరి వంశీ గురించి చెప్పుకొవడానికి ఏం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక.. రవితేజ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఏదైతే అనుకున్నారో.. అదే జరిగింది. కథ బాగానే ఉన్నా.. గ్రిప్పింగ్ లేని స్క్రిన్ ప్లే పెద్ద మైనస్ గా మారిపోయింది.

అలాగే సినిమాకు అనుకున్న దాని కంటే, ఎక్కువ బడ్జెట్ అయిందట. మూవీ మొత్తం కంప్లీట్ అయ్యే సరికి నిర్మాతలకు 80 కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్. దీనికి కారణం కూడా డైరెక్టరే అని అంటున్నారు. షూటింగ్ టైంలో చాలా వరకు అనసవరమైన షాట్స్ తీశాడట. దీంతో వేస్ట్ ఫుటేజ్ ఎక్కువైపోయిందట. దానిలో కొంత వరకు సినిమాలో పెట్టేశారు. ఫలితంగా నిడివి పెరిగిపోయింది. నెగిటివ్ టాక్ వచ్చింది. బడ్జెట్ పరంగా నిర్మాతలకు గట్టి దెబ్బే తగిలింది. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇంత కంటే ఎక్కువ ఏం కావాలి. ఇప్పుడు జరుగుతుంది అదే. అలాగే తెలుగు రన్ టైంని తగ్గించారు. కానీ, హిందీలో 3 గంటలకు పైగా ఉన్న సినిమా రన్ టైం ఇప్పటికీ అలాగే ఉంది. ఇది కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది.

- Advertisement -

యంగ్ డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఒక మాట చెబుతాడు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారని, వాళ్లు వేస్ట్ ఫుటేజ్ చేయకుండా, స్క్రిప్ట్‌ను సరిగ్గా ఫాలో అయితే అటు ప్రొడ్యూసర్లకు, సినిమాకు మంచి జరుగుతుందని అంటుంటారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వంశీ పాటించి ఉంటే, ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే వాళ్లు. అలాగే సినిమాకు టాక్ పాజటివ్ వచ్చేది. ఆయన కెరీర్ సెట్ అయ్యేది. కానీ, వంశీ అక్కడ పొరపాటు చేశాడు. ఫలితం నేటి కలెక్షన్లు.

ఇప్పటి వరకు ఈ సినిమా 20 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేసింది. థియేట్రికల్ బిజినెస్, ఇతర దారుల నుంచి వచ్చే అమౌంట్ ను అంతా కాల్క్యూలేట్ చేస్తే 80 కోట్లకు దాదాపు 25 కోట్ల వరకు తక్కువ ఉందట. అంటే.. టైగార్ నాగేశ్వరరావు నిర్మాత అభిషక్ అగర్వాల్ ప్రస్తుతం 25 కోట్ల నష్టాల్లో ఉన్నారు.

అయితే వారానికే నిర్మాత నష్టాల్లో ఉన్నాడని చెప్పలేం. కానీ, టైగర్ నాగేశ్వరరావుకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే, ఈ సినిమా కలెక్షన్లు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. రన్ టైంని తగ్గించినా, జరగాల్సిన నష్టం, రావాల్సిన నెగిటివ్ టాక్ ముందే వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ధైర్యం చేయడం లేదు. వస్తే మరో 5 కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయి కావొచ్చు. మొత్తంగా ఈ సినిమా 15 నుంచి 20 కోట్లకు పైగా నష్టాలు రావడం మాత్రం తప్పదని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

అంటే ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్లు తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే.. పెద్ద సినిమాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వేస్ట్ ఫుటేజ్‌ని వీలైనంత వరకు తగ్గించాలి. అలా చేయకపోతే, వంశీకి ఎదురైనదే జరుగుతుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు