Calling Sahasra: పాపం సుడిగాలి సుధీర్…అందరూ కలిసి కార్నర్ చేసేసారుగా?

సుడిగాలి సుధీర్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ని నమ్ముకుని ఎంతో కష్టపడి వచ్చిన నటుల్లో ఈ సుధీర్ కూడా ఒకరు. ఒక చిన్న మెజీషియన్ గా కెరీర్ ఆరంభించి, జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ గా మంచి ఫేమ్ సంపాదించి, తన టాలెంట్ తో సినిమాల్లో హీరోగా చేసే స్థాయికి వచ్చాడు.

నాలుగేళ్ళ కిందట సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తర్వాత హీరోగానే సినిమాలు చేసాడు. 3మంకీస్, వాంటెడ్ పండుగాడు లో వేరే హీరోలు ఉన్నా సుధీరే మెయిన్ లీడ్ గా చేసాడు. ఎందుకంటే సుధీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా హీరోగానే సినిమాలు చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి. లాస్ట్ ఇయర్ “గాలోడు” సినిమాతో సూపర్ హిట్ కూడా అందుకున్నాడు.

అయితే వన్ ఇయర్ కిందట సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్ర’ అనే హర్రర్ కాన్సెప్ట్ ఉన్న సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అరుణ్ విక్కీరాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో డాలీషా హీరోయిన్ గా నటిస్తుంది. షాడో మిడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్స్ లో చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు.

- Advertisement -

కొన్ని రకాల కారణాలతో సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. కానీ ఈ సినిమాపై ఇప్పుడొస్తున్న వార్తలు మాత్రం వైరల్ గా మారాయి. సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ముందు తనే ఉన్నా, ఆ తరువాత స్క్రిప్ట్ ని ఫిమేల్ వెర్షన్ కి అనుగుణంగా రాసి, సుధీర్ కి అన్యాయం చేసారని, అందుకే సుధీర్ ఈ సినిమాని రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే నిజానికి సుధీర్ ఇలా ప్రవర్తించలేదని, సినిమా రిలీజ్ కి టెక్నికల్ ఇష్యూ ల వల్ల అడ్డంకులు వచ్చాయని సుధీర్ కాలింగ్ సహస్ర సినిమా ఆపడానికి ఏమాత్రం అడ్డుకోలేదని, ఇదంతా సుధీర్ పైన గిట్టని వాళ్ళు చేస్తున్న కుట్ర అని సుడిగాలి సుధీర్ సన్నిహితులు అంటున్నారు. ఇటు సోషల్ మీడియా లో కూడా సుధీర్ ఫ్యాన్స్ సుధీర్ ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా “calling సహస్ర” షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని, నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే సుడిగాలి సుధీర్ పై వస్తున్న ఈ తప్పుడు వార్తలపై మాత్రం స్పందించలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు