Sudigali sudheer : తెలుగులోకి బ్యాచిలర్ సినిమా హీరోయిన్ ఎంట్రీ

కరోనా పుణ్యమా అని జనాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసే కల్చర్ బాగా పెరిగిపోయింది. సినిమా బాగుందని తెలిస్తే చాలు అది తెలుగా, తమిళా, ఇంకో వేరే భాషనా అని పట్టించుకోకుండా, ఏ ఓటిటిలో స్ట్రీమ్ అవుతుందో తెలుసుకొని సినిమా చూసేస్తున్నారు. కంటెంట్ కి డిమాండ్ పెరిగిపోవడంతో ఫిలిం మేకర్స్ కూడా వేరే బాషల సినిమాలని ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే. తమిళ్ లో ఈ పద్దతిలోనే ఒక సినిమా వచ్చి తెలుగులో మంచి హిట్ అయింది, ఆ సినిమానే ” బ్యాచిలర్”

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివీ ప్రకాష్ కుమార్ హీరోగా వచ్చిన ఈ బ్యాచిలర్ సినిమా మొదటగా తమిళ్ లో రిలీజై మంచి విజయం సాధించింది. అయితే జివీ ప్రకాష్ కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమున్న నటుడే అవడంతో ఈ సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లైవ్ లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. లివింగ్ రిలేషన్ షిప్ గురించి సాగే కథ అవడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. అంతే ఇక ఆ నోటా, ఈ నోటా సినిమా గురించి అందరు మాట్లాడుతుండటంతో బ్యాచిలర్ సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయింది.

అయితే బ్యాచిలర్ సినిమా అందరికి నచ్చడానికి ముఖ్య కారణం లీడ్ యాక్టర్స్ పెయిర్ బాగా ఉండటం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి పర్ఫామెన్స్ అందరికి బాగా నచ్చింది. ఈ సినిమా తరువాత తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మాడు ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. సుడిగాలి సుధీర్ హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లక్కీ మీడియా మరియు మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోన్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలనే “గాలోడు” సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న సుడిగాలి సుధీర్ మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన “పాగల్” సినిమా డైరెక్టర్ నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదటి సినిమాతోనే తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య భారతి కెరీర్, తెలుగులో ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు