#NBK109: బాలయ్య – బాబీ సినిమాలో కూడా గురూజీ ఇన్వాల్వ్ అవుతున్నాడా..?

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా గ్యాప్ ఇచ్చాడు. డైరెక్షన్ చెయ్యట్లేదు కానీ, అటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందే సినిమాలకు , ఇటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇటీవల ప్రారంభమైన NBK 109సినిమాలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు సితార ఎంటెర్టైమెంట్స్ తో పాటు త్రివిక్రమ్ సతీమణి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న కారణం చేత గురూజీ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యుంటాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవలే పూజ కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. పోస్టర్లో బాలయ్య ఫెవరెట్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ బాటిల్ తో పాటు కత్తులు, కొడవల్లతో సినిమా వైలెంట్ గా ఉండబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ తర్వాత సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉండబోతుందని వార్తలొచ్చిన నేపథ్యంలో ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళటానికి చాలా సమయం ఉండటంతో బాబీ బాలకృష్ణ సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది.

అఖండ సినిమా తర్వాత వీర సింహారెడ్డితో హిట్ అందుకొని ఊపు మీదున్న బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలను పెంచింది. అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తర్వాత బాబీ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు బాలయ్య. మరి, ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నాడన్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు