Guntur Kaaram : అంతా మహేష్ వల్లే… లేకపోతే కుర్చీ మడత పెట్టీ**

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో ఆ సందడి వేరేగా ఉంటుంది. ప్రస్తుతం “గుంటూరు కారం” మూవీ విషయంలో కూడా అదే జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందిన మూడవ చిత్రం “గుంటూరు కారం” కావడంతో మామూలుగానే మంచి హైప్ ఉంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ చేసిన హడావిడి, ప్రొడ్యూసర్ నాగ వంశీ ‘గుంటూరు కారం” మూవీపై పూర్తి నమ్మకం ఉందని, దాన్ని ఎలాంటి రివ్యూలు కూడా ఏం చేయలేవు అంటూ ఓవర్ కాన్ఫరెన్స్ తో స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి అందరికి ఫస్ట్ ఆప్షన్ “గుంటూరు కారమే’ అవుతుందని చెప్పడంతో అంచనాలు పీక్స్ కి వెళ్ళాయి. కానీ ఈరోజు అంటే జనవరి 12న రిలీజ్ అయిన “గుంటూరు కారం” మూవీకి యావరేజ్ టాక్ నడుస్తోంది.

ఇప్పటికే “గుంటూరు కారం” మూవీని థియేటర్లలో చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక రివ్యూవర్స్ అభిప్రాయం ప్రకారం స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగా లేవని, మాటల మాంత్రికుడు అనే బిరుదును దక్కించుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా తన బాధ్యతను సరిగ్గా నిర్వహించలేదని, గురూజీ మార్క్ డైలాగ్ సినిమాలో ఒక్కటి కూడా లేదని, ఈ విషయంలో ఆయనపై ట్రోలింగ్ రావడం ఖాయమని అంటున్నారు. పైగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బోర్ కొడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ల విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేదని, శ్రీలీలను కేవలం డాన్స్ కోసమే వాడుకున్నారని, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర గురించి అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదని వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన కీలక నటులు రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ ఓకే అనిపించారని, సునీల్ వంటి మంచి నటుడిని సినిమాలో తీసుకున్నప్పటికీ అతన్ని ఉపయోగించుకోలేకపోయారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వమే అన్నింటికంటే పెద్ద మైనస్ అంటున్నారు.

ఇక ఈ సినిమాను నిలబెట్టింది కేవలం మహేష్ బాబు మాత్రమే. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ బాబును ఎలా చూడాలి అనుకుంటున్నారో “గుంటూరు కారం” మూవీలో ఆయన అలాగే కనిపించాడు. సినిమాలో మహేష్ డాన్స్, ఫైట్ సన్నివేశాలను అలవోకగా చేసేసాడు. ఒకవేళ “గుంటూరు కారం” మూవీకి మంచి కలెక్షన్లు కనుక వస్తే ఆ క్రెడిట్ మొత్తం మహేష్ బాబుదే అని చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం మహేష్ బాబుదే. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో. మహేష్ బాబు గనక ఈ సినిమాలో లేకపోతే ఈ మూవీని చూసిన ప్రేక్షకులు కుర్చీ మడత పెట్టీ** మరీ తమ అసంతృప్తిని బయట పెట్టేవారు అన్నది మాత్రం వాస్తవం.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు