Sree Leela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌..అంతలోనే ?

Sree Leela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ కాలంలో టాప్మోస్ట్ హీరోయిన్లు గా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రీ లీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీ లీల…. ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ చేసిన ధమాకా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది.

ఇక ధమాకా సినిమా తర్వాత శ్రీ లీలా చేసిన ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమా పర్వాలేదనిపించింది. అయితే మొదటి లాగా హీరోయిన్ శ్రీ లీలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఆమె సినిమాలు వరుసగా ఫ్లాఫ్ కావడంతో దర్శకులు వెనుక అడుగు వేస్తున్నారు.

అయితే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకుందట హీరోయిన్ శ్రీ లీల. విజయ్ మరియు వెంకట్ ప్రభు కాంబినేషన్లో గోట్ సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేస్తోంది. అయితే ఇందులో ఐటెం సాంగ్ చేసేందుకు హీరోయిన్ శ్రీ లీలాను సంప్రదించిందట చిత్ర బృందం.

- Advertisement -

అయితే ఈ ఆఫర్ ను సింపుల్గా రిజెక్ట్ చేసిందట ఈ యంగ్ బ్యూటీ. కెరీర్ ప్రారంభంలోనే ఐటమ్ సాంగ్ చేస్తే… అందరూ ఐటెం సాంగ్ చేయాలని అడుగుతారని… అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిందట శ్రీ లీల. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు