Hanuman : సీక్వెల్ ప్రకటించిన మేకర్స్… టైటిల్ ఏంటి? రిలీజ్ ఎప్పుడంటే?

యంగ్ హీరో తేజ నటించిన “హనుమాన్” మూవీకి థియేటర్లలోనే సీక్వెల్ ను ప్రకటించి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. మరి ఇంతకీ ఈ మూవీ సీక్వెల్ కు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారు? ఆ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హనుమాన్”. ఈరోజు (జనవరి 12, శుక్రవారం) విడుదలైన ఈ మూవీలో తమిళ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి యావరేజ్ టాక్ నడుస్తోంది. వీక్ గా ఉండే ఒక దొంగ హనుమంతుడి సహాయంతో సూపర్ పవర్స్ పొంది, ఆ తర్వాత పవర్ ఫుల్ విలన్ నుంచి తన వాళ్లను, తనను ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం సినిమాను నిలబెట్టిందని, ఆఖరి 20 నిమిషాలు హైలెట్ గా ఉంటుంది అని ఇప్పటికే రివ్యూవర్స్ రివ్యూను ఇచ్చేశారు. కానీ రిలీజ్ కి ముందు అందరూ మోసేసినంత అద్భుతంగా అయితే సినిమా ఏమీ లేదని, అంజి, శ్రీ ఆంజనేయం, క్రిష్, జాంబీ రెడ్డి వంటి సినిమాలను మిక్స్ చేసి కొట్టినట్టుగా “హనుమాన్” ఉంది అంటున్నారు. కొత్త కథ కాకపోయినా విజువల్స్ తో డైరెక్టర్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఒకసారి థియేటర్లలో “హనుమాన్” మూవీని చూసేయచ్చని టాక్ నడుస్తోంది.

అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంది అనే విషయాన్ని “హనుమాన్” మేకర్స్ థియేటర్లలో రివీల్ చేశారు. ఈ సీక్వెల్ కు “జై హనుమాన్” అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. “హనుమాన్” క్లైమాక్స్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ 2025లో “జై హనుమాన్” మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. సినిమాలో సీనియర్ నటుడు సముద్రఖని క్యారెక్టర్ ద్వారా ఈ సీక్వెల్ పాయింట్ ను బయట పెట్టించాడు డైరెక్టర్. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న రాక్షసులను ఎదుర్కోవడానికి హనుమంతు ఎలాంటి సాహసాలు చేశాడు అనే విషయాన్ని సీక్వెల్లో చూపించబోతున్నారు. ఇక “హనుమాన్” తరహాలోనే సీక్వెల్ లో కూడా భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ప్రధానంగా ఉంటాయని, “హనుమాన్”ను మించిన సూపర్ పవర్స్ తో తేజ సజ్జ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే “జై హనుమాన్” షూటింగ్ ప్రారంభం కానుందని, ప్రస్తుతం ఉన్న నటీనటులతో పాటు మరికొందరు కొత్త స్టార్స్ “జై హనుమాన్” మూవీలో కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు