Guntur Kaaram vs Hanuman : “హనుమాన్” దెబ్బకు ఏఎంబీలో “గుంటూరు కారం” షో క్యాన్సిల్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత థియేటర్లోనే ఘోర అవమానం ఎదురైంది. మొదటి రోజే బుకింగ్స్ లేకపోవడంతో కొత్తగా యాడ్ చేసిన 1PM స్లాట్ “గుంటూరు కారం” షోలను థియేటర్లో క్యాన్సిల్ చేశారట. “హనుమాన్” దెబ్బకు “గుంటూరు కారం” షో క్యాన్సిల్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన “గుంటూరు కారం”, యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన “హనుమాన్” సినిమాల మధ్య పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ అవ్వడంతో క్లాష్ ఏర్పడింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలకు కూడా యావరేజ్ టాక్ నడుస్తోంది. “గుంటూరు కారం” సినిమాతో పోల్చుకుంటే “హనుమాన్” మూవీ టికెట్ బుకింగ్ లో టాప్ లో ఉంది. “గుంటూరు కారం” మూవీపై భారీ హైప్ ఉన్నప్పటికీ, జనాల ఇంట్రెస్ట్ మాత్రం “హనుమాన్” మూవీపైనే ఉంది. టికెట్ బుకింగ్స్ చూసుకుంటే “గుంటూరు కారం” మూవీకి ఒక గంటలో 16 వేల టికెట్లు బుక్ అయ్యాయి. “హనుమాన్”కు మాత్రం ఏకంగా 20,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఇలా టికెట్ల విషయంలోనే కాదు థియేటర్లలోనూ “గుంటూరు కారం” డీలా పడింది. పైగా ఈ రెండు సినిమాల మధ్య నెలకొన్న వివాదాలు, ముఖ్యంగా థియేటర్ల సమస్య “హనుమాన్” మూవీపై సింపతిని బాగా క్రియేట్ చేసింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా “హనుమాన్”కు క్యూ కడుతున్నారు. “గుంటూరు కారం” మూవీలో మహేష్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడంతో కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే ఆ మూవీని చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇలా “హనుమాన్” దూకుడు కారణంగా “గుంటూరు కారం” సినిమాకు వరుసగా షాకులు తగులుతున్నాయి.

తాజాగా మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ లో మొదటి రోజే “గుంటూరు కారం” సినిమా షో క్యాన్సిల్ కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏఎంబిలో కొత్తగా యాడ్ చేసిన 1PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో ఏకంగా ఆ షోనే క్యాన్సిల్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు లాంటి హీరో షో క్యాన్సిల్ అయింది అంటే అదేమీ చిన్న విషయం కాదు. నిజానికి “గుంటూరు కారం” మూవీ టికెట్లన్ని బుధవారం ఫుల్ గా సేల్ అయిపోవడంతో, ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని థియేటర్ యాజమాన్యం మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా ఒక స్లాట్ ని యాడ్ చేశారట. కానీ జనాలు మాత్రం లైట్ తీసుకుని వాళ్లకు షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి ఏయంబి మల్టీప్లెక్స్ నిర్వాహకులు ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్ లోనే ఎదురుదెబ్బ తగిలింది అనే వార్త మాత్రం వైరల్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు