Gunturu kaaram: దిల్ రాజు మేధస్సు ఏమైంది..!

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు తీసే నిర్మాత దిల్ రాజు. అటు నిర్మాత గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు దిల్ రాజు. ఈయన బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినిమం హిట్ అని ఫిక్స్ అయ్యే ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయంటే దిల్ రాజు చేసే మార్కెటింగ్ ప్రభావం కూడా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే టాలీవుడ్ లో ఏ సినిమానైనా థియేటర్లోకి వస్తుందంటే ఆ సినిమా గురించి వాటి రిజల్ట్ గురించి సరిగ్గా అంచనా వేయగల దిట్ట దిల్ రాజు. అంతెందుకు అప్పట్లో 2017 రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీ, ఇంకా బాలయ్య శాతకర్ణి సినిమాలకు అన్ని తెలిసి పోటీగా రిలీజ్ చేసిన శతమానం భవతి ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ తాను ప్రొడ్యూస్ చేసే సినిమా అంతబాగా లేదని తెలిసినా, రిలీజ్ కి ముందే చేసే ఎలాంటి ప్రయత్నాలైనా చేసి ఆ సినిమా తక్కువ నష్టాలతో బయట పడేలా చేస్తాడు. 2017 లో వచ్చిన “డీజే” సినిమా అలాంటిదే.

అయితే రీసెంట్ గా గుంటూరు కారం లో మాత్రం లెక్క తప్పింది. ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన దిల్ రాజు గుంటూరు కారం చిత్రాన్ని ఆల్మోస్ట్ తన సొంత సినిమాలనే ప్రమోట్ చేసాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ దగ్గర మొదలుకొని, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆఖరికి రిలీజ్ అయ్యాక కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడం జరిగింది. అయితే ఎన్నో సినిమాలు చూసి రిలీజ్ కి ముందే జడ్జ్ చేసే దిల్ రాజు మాస్టర్ బ్రెయిన్ ఈ సినిమా విషయంలో ఏమైందని దిల్ రాజు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.

- Advertisement -

మామూలుగానే సినిమా అటు ఇటు ఉందని కొంచెం తెలిసినా ఆ సినిమాల జోలికి పోనీ దిల్ రాజు గుంటూరు కారం విషయంలో ఎలా పప్పులో కాలేసాడని ట్రేడ్ విమర్శకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం బహుశా దిల్ రాజు గుంటూరు కారం సినిమా చూడకుండానే నైజాం రైట్స్ కొనుగోలు చేసి ఉండవచ్చు. కొనుక్కున్న తర్వాత సినిమా రిజల్ట్ తెలిసినా ఏమి చేయలేము కాబట్టి, ఇక సినిమా ప్రమోషన్లపైనా దృష్టి పెట్టి ఉండవచ్చు అని టాక్. ఇక నైజాం హక్కులు కూడా దాదాపు 42 కోట్లకు దిల్ రాజు కొనుక్కోగా పండగ అడ్వాంటేజ్ తో నైజాం లో భారీ ఓపెనింగ్స్ తో దిల్ రాజు సేఫ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు